Begin typing your search above and press return to search.
ఇండియాకు వస్తున్నా.. అంటున్న రానా
By: Tupaki Desk | 3 Oct 2019 9:00 AM GMTరానా దగ్గుబాటి గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యతో రానా బాధ పడుతున్నాడని.. దానికి అమెరికాలో చికిత్స తీసుకుంటున్నాడని ఒకవైపు వార్తలు వస్తూనే ఉన్నాయి కాని అటు రానా కానీ ఇటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు కానీ ఆ విషయాన్ని ఇప్పటివరకూ ధృవీకరించలేదు. పైగా తన ఆరోగ్యంపై వచ్చే వార్తలు రూమర్లేనని గతంలోనే రానా తోసిపుచ్చాడు.
తాజా సమాచారం ప్రకారం రానా ఇండియాకు వస్తున్నాడు. రానానే ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. ఒక ఫోటోను పోస్ట్ చేసి "ఆల్రైట్.. ఆన్లైన్ లోకి వచ్చాను. 72 గంటల్లో ఇండియాలో ఉంటాను" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఫోటోలో స్లిమ్ గానే ఉన్నాడు కానీ ఎప్పటిలాగా స్టైలిష్ గా ఉన్నాడు. పొడవాటి గడ్డం.. షార్ట్ హెయిర్ స్టైల్ తో యంగ్ లుక్ లో ఉన్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఒక ఫోటో పోస్ట్ చేస్తే మరీ బక్కగా కనిపించడంతో అభిమానులు చాలామంది 'ఏమైంది రానా.. ఆరోగ్యం సరిగా లేదా' అంటూ విచారించారు. కొత్తగా పోస్ట్ చేసిన ఫోటోలో మాత్రం ఆరోగ్యంగానే కనిపిస్తున్నాడు. ఈ పోస్టుకు మెగా హీరో ఆలు శిరీష్ స్పందిస్తూ "నీకు కంబ్యాక్ పార్టీ ఇవ్వాలి త్వరగా వచ్చెయ్" అంటూ రిప్లై ఇచ్చాడు.
రానా ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత 'విరాటపర్వం' షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ ఫిలింలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది