Begin typing your search above and press return to search.
తెలుగోళ్లు మారిపోయారంటున్న భల్లాలదేవ
By: Tupaki Desk | 7 Feb 2016 7:30 PM GMTప్రస్తుతం బాలీవుడ్ - టాలీవుడ్ - కోలీవుడ్.. మూడు ఇండస్ట్రీల్లోనూ అత్యంత క్రేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి. మూడు భాషల్లోనూ వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళ్తున్నాడతను. తమిళంలో చేసిన ‘బెంగళూరు డేస్’ కానీ.. బాల దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కానీ.. హిందీలో ‘ఘాజి’ కానీ.. తెలుగులో నటిస్తున్న ‘బాహుబలి’ కానీ.. ఏదీ కూడా రొటీన్ సినిమా కాదు. అన్నీ భిన్నమైనవే. అన్నీ ఇలా డిఫరెంట్ మూవీసే చేస్తున్నారేంటి అంటే.. ప్రేక్షకుల అభిరుచి అలా ఉందని అంటున్నాడు ఆ ఆరడుగుల ఆజానుబాహుడు. అన్ని భాషల ప్రేక్షకుల టేస్టు మారిందని.. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఆలోచనల్లో ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తోందని చెప్పాడు రానా.
తెలుగులో ఒకప్పుడు ఊహకైనా అందని సినిమాలు ప్రస్తుతం తెరకెక్కుతున్నాయని.. గత రెండేళ్లలో ప్రేక్షకుల అభిరుచిలో చాలా మార్పు వచ్చిందని రానా చెప్పాడు. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్లను మన ఆడియన్స్ ఏమాత్రం అంగీకరించట్లేదని చెబుతూ.. ఈ మధ్య ఆ తరహా సినిమాలకు దారుణమైన ఫలితాలొచ్చాయన్నాడు. బహుశా బ్రూస్ లీ - సౌఖ్యం తరహా సినిమాల్ని ఉద్దేశించే రానా ఆ మాటలన్నాడేమో. మొత్తానికి ఈ మార్పు చాలా మంచిదని.. దర్శక నిర్మాతలు కూడా వైవిధ్యమైన సినిమాలే తీయడానికి ప్రయత్నిస్తారని అంటున్నాడు. రానా వచ్చే రెండేళ్లలో తన సినిమాలు ఆరేడుదాకా విడుదలవుతాయని.. అవన్నీ తనను నటుడిగా మరో మెట్టు ఎక్కిస్తాయని రానా చెప్పాడు.