Begin typing your search above and press return to search.
మళ్ళీ కత్తిపట్టబోతున్న రానా
By: Tupaki Desk | 14 Nov 2017 12:40 PM GMTప్రస్తుతం ఉన్న హీరోల్లో కెరీర్ మొదటి నుంచే ప్రయోగాలు మొదలు పెట్టిన ఏకైక హీరో రానా దగ్గుబాటి. డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ని నమ్మకుండా కేవలం కంటెంట్ ని మాత్రమే నమ్మి తీసే హీరో. దర్శకుడు ఒక మంచి కథ తీసుకొస్తే తానే ముందుండి ఆ సినిమాను హై రేంజ్ కి తీసుకెళతాడు. హీరోగానే కాకుండా బాహుబలి లో విలన్ క్యారెక్టర్ చేసి ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఘాజి సినిమా చేసి మరో వైవిధ్యమైన హిట్ అందుకున్నాడు.
ఇక నేనె రాజు నేనె మంత్రి సినిమాతో కమర్షియల్ హిట్ కూడా అందుకొని ఆల్ రౌండర్ అని మరోసారి రుజువు చేశాడు. అయితే రానా ప్రస్తుతం 1945 సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాలో సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ సినిమానే కాకుండా మరో చారిత్రాత్మక కథను ఒకే చేశాడట. 18వ శతాబ్దంలో ట్రావన్ కొర్ కింగ్ మార్తాండ వర్మ కథ ఆధారంగా తెలుగు - మలయాళంలో సినిమాను తీయాలని ఓ బడా నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోంది. అయితే అందులో రానా మార్తాండ వర్మ గా కనిపించబోతున్నాడని టాక్.
ద్విభాషా చిత్రంగా నిర్మించబోయే ఈ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. బాహుబలి తర్వాత రానా మళ్లీ రాజుల యుద్దాలు పోరాటాలు ఉన్న కథని చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని తమిళ్ లో కూడా డబ్ చేయాలని అనుకుంటున్నారట.