Begin typing your search above and press return to search.
రోకా అన్న రానా..సరే గూగుల్ చేస్తా అన్న నాని!
By: Tupaki Desk | 22 May 2020 7:15 AM GMTరానా దగ్గుబాటి - మిహికా బజాజ్ కుటుంబాలు ఈమధ్య రామానాయుడు స్టూడియోస్ లో 20 వ తారీఖున ఓ వేడుక జరుపుకున్నారు. ఈ ఫోటోలు బయటకు రావడం ఆలస్యం.. అందరూ నిశ్చితార్థం అయిపోయిందని అనుకున్నారు. రానా పంచెకట్టు.. మిహికా పట్టుచీర కట్టు చూస్తే ఎవరైనా అలాగే అనుకునే అవకాశం ఉంది. న్యాచురల్ స్టార్ నానికి కూడా అదే అనుమానం రావడంతో ఎక్కువసేపు అలోచించి.. చించి బుర్ర హీటెక్కించుకోకుండా వాట్సాప్ లో అసలు సంగతి కనుక్కున్నాడు.
"అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిపోయిందా" అంటూ రానాను ప్రశ్నించాడు. రానా "రోకా ఫంక్షన్" అంటూ సమాధానం ఇచ్చాడు. చాలామంది తెలుగువారిలాగే ఆ పదం నానికి యమా కొత్తగా అపించడంతో "గూగుల్ చేస్తా" అని నిన్ను అడిగి ఈ సమయంలో విసిగించను అన్నట్టుగా ఓ జవాబిచ్చాడు. దాంతో పాటు ఓ లాఫింగ్ ఎమోజిని జోడించాడు. ఇక సాటి తెలుగువాడు అయిన రానాకు ఈ రోకా ఏంటో నానికి అర్థంకాక ఆ మెసేజ్ పెట్టాడనే విషయం అర్థం అయింది. దీంతో ఆయన కూడా రెండు లాఫింగ్ ఎమోజిలను పెట్టాడు. ఈ వాట్సాప్ చాట్ ను ఇండియా టుడే వారు ప్రచురించడంతో అందరికీ తెలిసింది.
నిశ్చితార్థం.. పెళ్లి.. రిసెప్షన్ వేడుకల గురించి అబ్బాయి.. అమ్మాయిలకు చెందిన రెండు కుటుంబాలు కలిసి చర్చించుకొనేందుకు కలిసే సమయంలో ఓ వేడుక జరుపుతారు. అదే ఈ రోకా ఫంక్షన్. కలిసి కూర్చుని మాట్లాడుకోవడమే కాకుండా ఒకరికొకరు గిఫ్టులు కూడా ఇచ్చుకుంటారట. మొత్తానికి రానా పుణ్యమా అని ఈ రోకా వేడుక సంగతి ప్రతి తెలుగువాడికి తెలిసిపోయింది.