Begin typing your search above and press return to search.

ద‌గ్గుబాటి వెడ్డింగ్ సాధాసీదాగా అంతేగా!

By:  Tupaki Desk   |   8 July 2020 2:46 AM GMT
ద‌గ్గుబాటి వెడ్డింగ్ సాధాసీదాగా అంతేగా!
X
రానా దగ్గుబట్టి ఆగస్టు 8న హైదరాబాదీ అమ్మాయి మిహీకా బజాజ్ ని వివాహం చేసుకోబోతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరు కుటుంబాలు వెడ్డింగ్ కి ప్రీప్రిప‌రేష‌న్స్ స్టార్ట్ చేశాయి. హైదరాబాద్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ హోటల్ లో ఈ వివాహం జరుగ‌నుంది.

వివాహానికి ముందు ఉత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి!! అంటూ ఇదివ‌ర‌కే రానా- మిహీక జంట క్లూ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నిన్న‌నే పెళ్లిలో వ‌రుడు ధ‌రించే జూట్ స్లిప్ప‌ర్స్ ఫోటోని మిహీక సోష‌ల్ మీడియాల్లో షేర్ చేశారు. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ వ‌ల్ల సాధాసీదాగానే ఉత్స‌వం మొద‌లైనా ఇరు కుటుంబాలు సెల‌బ్రేష‌న్స్ మోడ్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లికి కావాల్సిన ఏర్పాట్ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు బంధుమిత్రులు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ మెట్రో న‌గ‌రం అల్ల‌క‌ల్లోలంగా ఉన్న నేప‌థ్యంలో మునుముందు కరోనా భయం మరింత పెరిగితే.. ఈ పెళ్లికి అతిథుల సంఖ్య‌ను మ‌రింత కుదించే ఆలోచ‌న‌లో ఇరు కుటుంబీకులు ఉన్నార‌న్న‌ది తాజా వార్త‌. కేవలం 10 నుండి 15 మంది సభ్యులతో వివాహాన్ని ఎంతో సింపుల్ గా జ‌రుపుకోవాల‌ని భావిస్తున్నారు.

ఇదే కాకుండా.. అతిథుల జాబితా- బస- ఆహారం వ‌గైరా ఏర్పాట్లపైనా సునిశితంగా ప‌రిశీల‌న‌లో ఉన్నారు. ఏదైనా ఖ‌ర్చు చేసే ముందు చాలా సున్నితమైన పద్ధతిలో డబ్బును వృథా చేయకుండా ఖ‌ర్చు చేస్తున్నార‌ట‌. ప్రస్తుతానికి ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నందున రానా - మిహీక జంట క‌ల‌ల విహారం ప్ర‌స్తుతం యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది.