Begin typing your search above and press return to search.

రానాపై కేసు నిలబడుతుందా?

By:  Tupaki Desk   |   23 Oct 2016 10:37 AM GMT
రానాపై కేసు నిలబడుతుందా?
X
రానాపై కేసు నడుస్తోంది. అవునా... అని ఆశ్చర్యపోకండి. అవును రానా పై కోయంబత్తూర్ కు చెందిన ఒక సామాజిక కార్యకర్త కేసు వేశాడు. ఈ విషయంలో రానా తో పాటు ప్రకాశ్ రాజ్ పై కూడా కేసు వేశారనుకోండి. బాహుబలి బళ్లాలదేవ - యంగ్ హీరో రానా - సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ లపై ఒక కేసు నమోదైంది. ఇప్పటికే అర్ధమై ఉంటుంది, అది దేనికి సంబందించిన కేసు అని. అవును... మీ ఊహ కరక్టే... జంగిల్ రమ్మీ అనే ఆన్ లైన్ యాడ్ లో ప్రకాష్ రాజ్ తో కలిసి రానా నటించిన సంగతి తెలిసిందే.

వివరాళ్లోకి వస్తే... రానా - ప్రకాష్ రాజ్ తో కలిసి "జంగిల్ రమ్మీ" అనే ఆన్‌ లైన్‌ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ వాణిజ్య ప్రకటన ద్వారా ఈ ఇద్దరూ గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహిస్తున్నారని కోయంబత్తూర్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త కేసు వేశాడు. వీరిద్దరూ ఈ యాడ్ లో నటించడంపై సోషల్ మీడియాలో గతంలోనూ విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ ప్రకటనలో నటించేముందు రానా తగు జాగ్రత్తలు తీసుకున్నాడట. ఈ క్రమంలో తన లాయర్‌ సలహా తీసుకున్న తర్వాత ఆయన ఈ వాణిజ్య ప్రకటనలో నటించినట్టు చెప్తున్నారు.

ఈ విషయాలపై... రమ్మీ అంటే గ్యాంబ్లింగ్‌ కాదని, అది నైపుణ్యానికి సంబంధించిన ఆట అని, దీని కోసం ప్రచారం చేయడం చట్టవ్యతిరేకమేమీ కాదని రానాకు లాయర్‌ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో గతంలోనూ మద్రాస్ హైకోర్టు ఈ విషయమై ఒక తీర్పు ఇచ్చింది. రమ్మీ అనేది ఓ స్కిల్ అని, అది గాంబ్లింగ్ లెక్కల్లోకి రాదని తేల్చి చెప్పింది. అలాగే రమ్మీ ఆడుతున్న వారిని డిస్ట్రబ్ చేయవద్దని పోలీస్ లను కోరింది. దీంతో రానాకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త వేసిన కేసు నిలబడదని కథనాలు వస్తునాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/