Begin typing your search above and press return to search.

రానా కొత్త సినిమా కాన్సెప్ట్ కిరాక్ గా ఉందిగా

By:  Tupaki Desk   |   24 March 2019 1:30 AM GMT
రానా కొత్త సినిమా కాన్సెప్ట్ కిరాక్ గా ఉందిగా
X
టాలీవుడ్ హీరోలలో రానా దగ్గుబాటి రూటే సపరేటు. ముఖ్యంగా 'బాహుబలి' తర్వాత రానా సెలెక్షన్ పూర్తిగా మారిపోయింది. విభిన్నమైన కథాంశాలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటికే 'హాథి మేరె సాథీ'.. '1945' లాంటి విభిన్నమైన చిత్రాలలో నటిస్తున్న రానా 'విరాటపర్వం' అనే మరో చిత్రానికి కూడా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రానా ఈ సినిమాలో ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

'నీది నాది ఒకే కథ' లాంటి విభిన్నమైన సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఉడుగుల ఈ 'విరాటపర్వం' చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరికొంత ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకు వచ్చింది. ఈ చిత్రం ఎమర్జెన్సీ నాటి 1975 లో ప్రారంభమై 1992 లో ముగుస్తుందట. ఇందులో రానా.. సాయిపల్లవి విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారట. హ్యూమన్ రైట్స్ అంశాలను అంతర్లీనంగా చర్చిస్తారట. ఈ సినిమాలో మరో అట్రాక్షన్ కూడా ఉంది. టాలెంటెడ్ ఆర్టిస్ట్ టబు ఒక మానవ హక్కుల కార్యకర్త పాత్రలో నటిస్తోందని సమాచారం.

పీరియడ్ ఫిలింగా భారీ స్కేల్ లో తెరకెక్కుతుండడంతో బడ్జెట్ కూడా ఎక్కువే అవుతుందట. రానా నాన్నగారు సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం జులైలో సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. ఈ సినిమా కాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ 'హిరణ్యకశ్యప' ను కూడా రానా లైన్లో పెట్టాడు.