Begin typing your search above and press return to search.

రానాతో పాటు వారు కూడా ప్రెగ్నెంట్‌ కాదంటూ క్లారిటీ

By:  Tupaki Desk   |   22 Nov 2022 10:07 AM GMT
రానాతో పాటు వారు కూడా ప్రెగ్నెంట్‌ కాదంటూ క్లారిటీ
X
యంగ్ హీరో రానా తండ్రి కాబోతున్నాడు.. ఆ విషయాన్ని అతి త్వరలో దగ్గుబాటి ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో రానా తన భార్య మిహిక బజాజ్ ప్రెగ్నెంట్‌ కాదంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి తాము వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాము.. పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఆలోచన లేదు అన్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు.

రానా భార్య మిహిక ప్రెగ్నెంట్‌ అంటూ గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని ఫ్యామిలీ ఫ్రెండ్స్ పేర్కొన్నారు. మళ్లీ వచ్చిన మిహిక ప్రెగ్నెంట్‌ వార్తలు మీడియాను కుదిపేస్తున్న నేపథ్యంలో స్వయంగా రానా తన భార్య ప్రెగ్నెంట్‌ కాదు అంటూ తెలియజేయాల్సి వచ్చింది. ఈ సమయంలోనే మరికొందరు హీరోలు కూడా తమ భార్యలు ప్రెగ్నెంట్‌ కాదని తెలియజేశారు.

ఆ మధ్య ప్రేమ వివాహం చేసుకున్న ఆది పినిశెట్టి తండ్రి కాబోతున్నాడు అనే వార్తలు తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి. ఆది భార్య నిక్కీ గర్లాని ఇటీవల కొత్తగా సినిమాలు కమిట్ అవ్వలేదు.. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలను హడావుడిగా ఫినిష్‌ చేసింది కనుక ఆమె గర్భం దాల్చి ఉంటుందని చాలా మంది భావించారు. మీడియాలో ఆ విషయమై ప్రముఖంగా వార్తలు వచ్చాయి.

నిక్కీ గర్లాని గర్భం దాల్చినట్టుగా వచ్చిన వార్తలు నిజం కాదని ఆది తెలియజేశాడు. సన్నిహితుల వద్ద ఆది ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఆది తో పాటు బాలీవుడ్‌ యంగ్‌ హీరో విక్కీ కౌశల్ కూడా తన భార్య కత్రీనా కైఫ్‌ గర్భవతి కాదు అంటూ తెలియజేయాల్సి వచ్చింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రీనా కైఫ్ గర్భం దాల్చినట్లుగా గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అవి అవాస్తవ కథనాలు అన్నట్లుగా విక్కీ కౌశల్‌ పేర్కొన్నాడు. వీళ్లు మాత్రమే కాకుండా టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్ కూడా తన భార్య గర్భం దాల్చలేదు అంటూ సన్నిహితుల వద్ద పేర్కొన్నాడట.

ఆ మధ్య నితిన్ తండ్రి కాబోతున్నాడు అంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో సన్నిహితుల వద్ద నితిన్ క్లారిటీ ఇచ్చాడని తెలుస్తోంది. మొత్తానికి రానా భార్య మిహిక మాత్రమే కాకుండా ఇంత మంది స్టార్ సెలబ్రెటీలు తల్లి.. తండ్రి కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో మెజారిటీ శాతం వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.