Begin typing your search above and press return to search.
ఫిలిం టెక్నాలజీ పై రానా ఏం చెప్పాడులే
By: Tupaki Desk | 27 Nov 2017 6:47 AM GMTటెక్నాలజీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాట తెగ వినిపిస్తున్న మాట. సామాన్యుడి జీవితంలోకే కాదు.. చేతిలోకి కూడా వచ్చేసిన టెక్నాలజీపై ఎంత చెప్పుకున్నా తక్కువే. టెక్నాలజీ.. ఎంటర్టెయిన్మెంట్.. డిజైన్.. ఈ మూడింటిని కలిపి టెడ్ఎక్స్ నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్ లో టాలీవుడ్ హీరో రానా చెప్పిన మాటలు అందరికీ ఉత్సాహం కలిగించాయి.
మహాత్మా గాంధీ.. బెన్ కింగ్ స్లే మాదిరిగా కనిపిస్తారని.. అడాల్ఫ్ హిట్లర్.. ఛార్లీ చాప్లిన్ లా కనిపిస్తారని తన స్పీచ్ ప్రారంభించిన రానా.. సినిమా రంగంలో జరిగిన మార్పులను వివరించాడు. సినిమా ఆరంభం నుంచి.. దేశంలో రూపొందిన తొలి చిత్రం సత్య హరిశ్చంద్ర అని.. కొన్ని దశాబ్దాల తర్వాత తెలుగులో సినిమాలు మొదలయ్యాయని చెప్పాడు. ఓ పల్లెటూరిలో పుట్టిన తన తాత రామానాయుడు.. సినిమా రంగంపై ఉన్న ప్యాషన్ తో రాముడు-భీముడు చిత్రంతో చిత్ర నిర్మాణం ఆరంభించారన్న రానా.. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్.. ఎగ్జిబిషన్ విభాగాల్లోకి కూడా వచ్చామని తెలిపాడు.
సినిమాకు శబ్దం వచ్చిన తర్వాత సౌండ్ ఇంజినీర్స్.. ఆ తర్వాతి కాలంలో గ్రాఫిక్స్ లాంటి వచ్చాయని తెలిపిన రానా.. తాము చాలానే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినట్లు చెప్పాడు. కానీ మారుతున్న టెక్నాలజీ కారణంగా చాలావరకు మౌలిక వసతులు ఇప్పుడు నిరుపయోగంగా మారాయని.. తాము కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాల్సిన అవసరం గుర్తించామన్నాడు రానా.
రాబోయే కాలంలో వర్చువల్ రియాలిటీ.. ఆగ్మెంటేషన్ రియాలిటీ వంటివి అందుబాటులోకి వచ్చేస్తాయని చెప్పిన రానా.. ఓ సెలబ్రిటీ మీకోసం ప్రత్యేకంగా మీ ఇంట్లో.. ప్రదర్శించగలిగే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని అన్నాడు. అయితే.. తాము కేవలం సాధనాలు మాత్రమేనని.. ఇదంతా టెక్నాలజీ నిపుణులు సాధిస్తున్న ప్రగతిగా చెప్పి.. క్రెడిట్ అంతా వారికి ఇచ్చేసి ఆశ్చర్యపరిచాడు రానా.