Begin typing your search above and press return to search.
రానా మళ్లీ ఛాన్స్ ఇస్తాడా.. ఔట్ డేటెడ్ డైరెక్టర్ కి?
By: Tupaki Desk | 7 March 2020 4:48 AM GMT`నేనే రాజు నేనే మంత్రి` సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయిన తేజ మళ్లీ `సీత` లాంటి ప్లాప్ తీసి రేసులో వెనక్కి వెళ్లాడు. కాజల్ తో తీసిన సీత మ్యాజిక్ చేస్తుందని నమ్మినా చేతులు కాల్చుకోవాల్సొచ్చింది. వాస్తవానికి నేనే రాజు నేనే మంత్రి సినిమా యావరేజ్ గానే ఆడింది. భారీ వసూళ్లు తెచ్చిన చిత్రం కాదు. కాకపోతే దర్శకుడిగా తేజకు కొంత ఊపు తెచ్చింది. లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్లతో పాటు.. జానర్ మార్చి తేజ ఇలాంటి సినిమాలు కూడా తీస్తాడా? అంటూ విమర్శకుల ప్రశంసించారు. డిజాస్టర్ `సీత` ఆ ఐడెంటిటీని ఎంతో కాలం నిలవనివ్వలేదు.
దీంతో కొంత గ్యాప్ వచ్చింది. మొన్ననే తేజ వరుసగా రెండు సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. `అలిమేలుమంగ వెంకటరమణ`, `రాక్షస రాజ్యంలో రావణాసురుడు` అనే రెండు సినిమాలు ప్రకటించాడు. రెండు స్క్రిప్ట్ లు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాడు. ప్రస్తుతం వాటికి హీరోల్ని వెతికే పనిలో ఉన్నాడు. గోపీచంద్ తో అలిమేలు మంగ వెంకట రమణ చిత్రాన్ని...రానాతో రాక్షస రాజ్యం లో రావణాసురుడు చిత్రాలు తెరకెక్కించనున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే మళ్లీ రానాతో మరోసారి పొలిటికల్ అంశాన్ని టచ్ చేస్తున్నాడనే ప్రచారం వేడెక్కిస్తోంది. అయితే అసలు రానా..తేజకి మళ్లీ ఛాన్స్ ఇచ్చాడా? అన్నదే ఇక్కడో సందేహం. తేజ ఔట్ డేటెడ్ డైరెక్టర్ అని ఇప్పటికే విమర్శలున్నాయి. హీరోలెవరు అవకాశాలివ్వని సన్నివేశమైతే ఉంది. కంటెంట్ పరంగానూ తేజ నేటి తరం దర్శకులతో పోటీ పడలేడని ఇన్ సైడ్ టాక్ ఉంది.
గతంలో రానా తో చేసిన` నేనే రాజు నేనే మంత్రి` సినిమా క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకున్నా.. బాక్సాఫీస్ వద్ద మిరాకిల్స్ ఏమీ జరగలేదు. కాసుల్ని కురిపించలేదు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో రానా మళ్లీ ఛాన్స్ ఎలా ఇస్తాడు? అదీ ప్లాప్ ల్లో ఉన్న మేకర్ కి ఛాన్స్ ఇచ్చి రిస్క్ తీసుకుంటాడా? అన్న రకరకాల సందేహాలు అభిమానుల్ని వెంటాడుతున్నాయి. డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడానికి రానా ఎప్పుడూ ముందుంటాడు. కానీ ప్లాప్ లు వచ్చినప్పుడు కూడా రిస్క్ తీసుకుంటాడా? అన్నది సందేహం వ్యక్తమవుతోంది. మరి దీనికి తేజ నుంచి కానీ రానా నుంచి కానీ క్లారిటీ వస్తుందేమో చూడాలి.