Begin typing your search above and press return to search.

ఘాజీ రేంజ్.. 40 నుంచి 700కు

By:  Tupaki Desk   |   13 Feb 2017 10:30 AM GMT
ఘాజీ రేంజ్.. 40 నుంచి 700కు
X
ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ వార్ ఫిల్మ్ ‘ఘాజీ’ ఇంకో నాలుగు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా మీద నిర్మాతలు చాల కోట్లు బడ్జెట్ పెట్టారు. దానికి తగ్గట్లే ట్రైలర్లో క్వాలిటీ కనిపిస్తోంది. ఇండియన్ ఆడియన్స్ కు ‘ఘాజీ’ సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ఐతే ఇంత భారీ చిత్రంగా మారిన ‘ఘాజీ’ని ముందు దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఒక లఘుచిత్రంగా తీయాలనుకున్నాడు. ఐతే షార్ట్ ఫిల్మ్ కోసమని వేసిన సెట్టింగ్ చూసి రానా.. పీవీపీ ఇంప్రెస్ కావడంతో ఇది సినిమాగా మారింది. వీళ్ల రాకతో సినిమా రేంజే మారిపోయిందని అంటున్నాడు దర్శకుడు సంకల్ప్.

నిజానికి ‘ఘాజీ’ కోసం కేవలం 40 కంప్యూటర్ గ్రాఫిక్ షాట్లు అనుకున్నారట. నీటి లోపల వచ్చే సన్నివేశాల కోసం 30 షాట్లు.. వెలుపలి సన్నివేశాలకు 10 షాట్లు ప్లాన్ చేసుకున్నారట. కానీ పీవీపీ అండ్ కో సినిమాను టేకప్ చేయడంతో 40 సీజీ షాట్లు కాస్తా 700 షాట్లయ్యాయట. దీంతో సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయిందని.. ఖర్చు విషయంలో అసలేమాత్రం రాజీ పడకపోవడంతో సినిమా హాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయిందని సంకల్ప్ బృందం చెబుతోంది. ప్రస్తుతం ఇండియాలో ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో సీజీ షాట్లు చేసింది ‘ఘాజీ’కేనట. ‘‘సీజీ లేకుంటే ఘాజీ లేదు. ఇప్పటిదాకా ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద పూర్తి అండర్ వాటర్ అనుభవాన్ని భారతీయ ప్రేక్షకులెవ్వరూ చూసి ఉండరు. మేం సినిమా మొదలుపెట్టడానికి ముందు రెండేళ్ల పాటు ‘ఘాజీ’ని ఎలా తీర్చిదిద్దాలి.. గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ ఎలా తీయాలి అని అధ్యయనం చేశాం. అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా సీజీ.. వీఎఫ్ఎక్స్ తీర్చిదిద్దాం’’ అని ‘ఘాజీ’ వీఎఫ్ఎక్స్ పర్యవేక్షకుడు వాసుదేవ్ తెలిపాడు.