Begin typing your search above and press return to search.

'సుల్తాన్'ను మించే రానా దగ్గుబాటి మూవీ

By:  Tupaki Desk   |   9 July 2016 12:07 PM IST
సుల్తాన్ను మించే రానా దగ్గుబాటి మూవీ
X
ఇప్పుడు బాలీవుడ్‌ అంతా కూడా వ్రెజ్లింగ్‌ మూవీ ''సుల్తాన్‌'' గురించే కలవరిస్తోంది. కొన్ని రియల్ లైఫ్‌ స్టోరీలను బేస్‌ చేసుకుని.. దానికి కావల్సినంత మసాలా కలుపుకుని.. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా యశ్ రాజ్‌ ఫిలింస్ వారు తీసిన ఈ సినిమా.. మూడు రోజుల్లో 100 కోట్ల నెట్ వసూళ్ళు సాధించి రికార్డులను తిరగరాస్తోంది. ఇక త్వరలో అమీర్‌ ఖాన్‌ తీస్తున్న ''దంగల్'' సినిమా కూడా వస్తుంది. ఎంతసేపూ ఇలా బాలీవుడ్ వారు చేసే కుస్తీ విన్యాశాలు చూడటమేనా? మనం ఏమన్నా చేసేదుందా?

ఉంది అంటున్నాడు కండలవీరుడు దగ్గుబాటి రానా. బాహుబలి కోసం తాను పెంచిన కండలను వృధా చేయకుండా.. తను కూడా ఒక కుస్తీ వీరుని కథలో నటిస్తానని చెబుతున్నాడు. ఏం మనకేమన్నా పహిల్వాన్ లు తక్కువా? కాదు కదా. విజయనగరంకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు అనే కుస్తీ పోటీదారుడు ఒకాయన ఉన్నారు. ఆయన ఎంతటి లెజండరీ అంటే.. శ్రీకాకుళం నుండి వెళ్లి లండన్ బకింగమ్ ప్యాలెస్ లో కుస్తీలో పాల్గొని.. అక్కడ కింగ్ జేమ్స్ ఫైవ్‌.. ఆయన సతీమణి క్వీన్‌ మేరి చేతుల మీదుగా.. ''ఇండియన్ హెర్క్యూల్స్'' ''కలియుగ భీమ'' అంటూ అవార్డులు అందించాను. 1942లో మరణించిన ఈ ఆంధ్రుడి జీవిత చరిత్రను ఇప్పుడు రానా తెరక్కెక్కించాలని భావిస్తున్నాడు.

నిజంగానే ఇలాంటి సినిమా మన దగ్గర వచ్చిందంటే.. బాహుబలితో డబుల్‌ అయిన మన స్థాయి ఇప్పుడు ట్రిపుల్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ రానా.