Begin typing your search above and press return to search.
బాలా దర్శకత్వంలో రానా
By: Tupaki Desk | 8 Feb 2016 9:30 AM GMTరానా జోరు మామూలుగా లేదిప్పుడు. ఇటు తెలుగు - అటు తమిళం - హిందీ... మూడు భాషల్లోనూ దున్నేస్తున్నాడు. ఇటీవల తమిళ చిత్రం బెంగుళూరు నాట్కల్ లో నటించిన రానాకి మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు అక్కడి దర్శకులు రానాతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు - నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన బాలాతో రానా ఓ చిత్రం చేయబోతున్నారు. ఒక మంచి కథేదైనా ఉంటే చెప్పండి అని రానా స్వయంగా అడగడం, రానా ఆసక్తిని చూసి బాలా ఓ కథని వినిపించడం చకచకా జరిగిపోయాయట. త్వరలోనే ఆ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోందని స్వయంగా రానా ఓ ఇంటర్వ్యూ లో ప్రకటించాడు.
బాలాతో పాటు అమీర్ అనే మరో దర్శకుడితోనూ రానా తమిళంలో సినిమా చేయబోతున్నారు. ఏంటీ... అన్నీ తమిళంలోనే చేస్తున్నాడా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. తెలుగులోనూ లీడర్2 తెరకెక్కబోతోందట. ఐదేళ్ల తర్వాత సేమ్ లీడర్ టీమ్ తోనే సీక్వెల్ చిత్రం తెరకెక్కబోతోందని స్పష్టం చేశాడు రానా. ప్రస్తుతం ఆయన తెలుగు - తమిళం - హిందీ భాషల్లో ఘాజీతో పాటు - బాహుబలి 2లో నటిస్తున్నాడు. ఆ రెండు చిత్రాల తర్వాత బాలా సినిమాతో పాటు శేఖర్ కమ్ములతో లీడర్2 ఒకేసారి సెట్స్ పైకి వెళతాయి. బాలా పలుమార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకొన్న దర్శకుడు. ఆయన సినిమాలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అందుకే రానా ఇష్టపడి మరీ బాలా దర్శకత్వంలో ప్రాజెక్టు ఓకే చేయించుకొన్నాడు.