Begin typing your search above and press return to search.

అరణ్యలో మావటి రానా

By:  Tupaki Desk   |   5 Jun 2018 7:56 AM GMT
అరణ్యలో మావటి రానా
X
దగ్గుబాటి హీరో రానా రెగ్యులర్ కమర్షియల్ ఇమేజ్ కు భిన్నంగా కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. బాహుబలి కన్నా ముందు అందరు హీరోల్లాగే కొన్ని రొటీన్ సినిమాలు చేసిన రానాకు ఆ సినిమా ఘన విజయం తన దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. అందుకే తాను హీరోనా కాదా అనేది ఆలోచించకుండా తనకు ఆ పాత్ర ఎంతవరకు హెల్ప్ అవుతుందని అనే దాని మీద దృష్టి పెడుతున్నాడు. అందులో భాగంగా చేస్తున్న మూవీనే అరణ్య. తమిళ్ లో కాడన్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని హిందీలో కూడా ఏక కాలంలో తీస్తున్నారు. దశాబ్దాల క్రితం వచ్చిన రాజేష్ ఖన్నా సూపర్ హిట్ మూవీ హాథీ మేరె సాథి స్ఫూర్తితో రూపొందిన ఈ మూవీకి దర్శకుడు ప్రభు సల్మాన్. ప్రకృతి నేపథ్యంలో అద్భుతమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో తన ప్రత్యేకత చూపించే ప్రభు సాల్మన్ రానా సినిమాలో ఏకంగా అడవి అందాలు జంతువుల మధ్య అనుబంధాలు ఆవిష్కరించబోతున్నాడు. తెలుగులో అరణ్య అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్న ఈ మూవీలో మనిషికి జంతువులకు మధ్య ఎమోషన్స్ ని రానా పాత్ర ద్వారా చూపించబోతున్నట్టు తెలిసింది .

హిందీ టైటిల్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. హాథీ మేరె సాథి పెట్టడం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జంగల్ అని పెడదాం అంటే ఆ మధ్య ఇదే టైటిల్ తో వర్మ సినిమా ఒకటి వచ్చింది కాబట్టి ఆ పేరు అనుమానమే. ఇందులో రానా మావటివాడిగా నటిస్తున్నట్టు వినికిడి . గతంలో ప్రభు సాల్మన్ తీసిన గజరాజులో హీరోది ఇలాంటి పాత్రే. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ కు ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చినట్టు తెలిసింది. రానాకు చిన్న కంటి ఆపరేషన్ అవసరం పడిన నేపథ్యంలో ఇది తప్పలేదట.భల్లాల దేవాగా నేవీ ఆఫీసర్ గా ఇలా ఒకదానికి ఒకటి పొంతన లేని పాత్రలు చేస్తూ తనలో నటుడికి ఛాలెంజ్ విసురుతున్న రానా బాహుబలి వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి అరణ్యకు బాలీవుడ్ లో భారీ మార్కెట్ ని ఆశిస్తున్నారు నిర్మాతలు.