Begin typing your search above and press return to search.

ఆ చిన్న సినిమా అద్భుతం అంటున్నారే..

By:  Tupaki Desk   |   3 April 2018 5:30 PM GMT
ఆ చిన్న సినిమా అద్భుతం అంటున్నారే..
X
ప్రస్తుతం టాలీవుడ్లో మెజారిటీ చర్చలు ‘రంగస్థలం’ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక చిన్న సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ సినిమా పేరు.. కేరాఫ్ కంచరపాలెం. అందరూ కొత్త వాళ్లు నటించిన ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. విజయ ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ విడుదలకు ముందే న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపికైంది. ఈ గౌరవం దక్కించుకున్న తొలి తెలుగు సినిమా ఇదేనట. ఇదొక విభిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా అని.. చాలా రియలిస్టిగ్గా సాగుతూ ఆకట్టుకుంటుందని అంటున్నారు.

ఈ ఏడాది తెలుగులో ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘కేరాఫ్ కంచరపాలెం’ నిలుస్తుందని ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులు కితాబిస్తుండటం విశేషం. ఇంతకుముందు ‘పెళ్ళిచూపులు’.. ‘మెంటల్ మదిలో’ లాంటి సినిమాలకు అండగా నిలిచిన సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తమ బేనర్ ద్వారా రిలీజ్ చేయడానికి ముందుకు రావడం గమనార్హం. రానా దగ్గుబాటి ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తితో తమ బేనర్ ద్వారా సమర్పణకు సిద్ధమయ్యాడట. ‘పెళ్ళిచూపులు’ తరహాలోనే దీనికి కూడా స్పెషల్ ప్రిమియర్లు వేసి.. జనాల్లోకి సినిమానే తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఉదాత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి జాతీయ అవార్డుల్లోనూ కొన్ని పురస్కారాలు దక్కొచ్చని కూడా అంటుండటం విశేషం. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.