Begin typing your search above and press return to search.

విష్ణు నన్ను బెదిరించాడన్న భ‌ళ్లాలుడు!

By:  Tupaki Desk   |   16 March 2021 4:00 AM GMT
విష్ణు నన్ను బెదిరించాడన్న భ‌ళ్లాలుడు!
X
టాలీవుడ్ హీరోలు విష్ణు మంచు- రానా దగ్గుబాటి స్నేహానుబంధం గురించి తెలిసిందే. ఇరు కుటుంబాల న‌డుమ చ‌క్క‌ని స‌త్సంబంధాలు ఉన్నాయి. తాజాగా విష్ణు మంచు న‌టించిన థ్రిల్ల‌ర్ మూవీ మోస‌గాళ్లు ప్రీరిలీజ్ వేడుక‌కు దగ్గుబాటి రానా అతిథిగా విచ్చేశారు.

ప్రీఈవెంట్లో అత‌డు త‌న స్నేహితుడు విష్ణు గురించి మాట్లాడుతూ.. ఈ వేదిక‌కు రాక‌పోతే.. అంటూ బెదిరించాడ‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. త‌మ మ‌ధ్య స్నేహానుబంధాన్ని రానా వెల్ల‌డించిన తీరు అభిమానుల్ని ఆక‌ట్టుకుంది.

``విష్ణు పిలిచి బెదిరించాడు.. వ‌చ్చాను.. మార్చి 19 ఒక ప్ర‌త్యేక వ్య‌క్తి (మోహన్ బాబు) పుట్టినరోజు కానుక‌గా మోస‌గాళ్లు అదే తేదీన‌ విడుదల చేస్తున్నారు. మీరందరూ సినిమా చూసి భారీ విజయాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను..`` అని రానా అన్నారు.

మోస‌గాళ్లు చిత్రంలో కీల‌క పాత్ర పోషించిన బాలీవుడ్ వెట‌ర‌న్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి పైనా రానా తన అభిమానాన్ని చాటుకున్నారు. నేను చిన్నప్పటి నుంచీ సునీల్ సార్ కు పెద్ద అభిమానిని. నా 8వ తరగతిలోనే నేను అతని సినిమా చూశాను. సునీల్ సార్ లా కండ‌లు పెంచాల‌ని ఆనాడే నిర్ణయించుకున్నాను`` అని రానా చెప్పారు.