Begin typing your search above and press return to search.
బందిపోటు దొంగగా రానా
By: Tupaki Desk | 23 Jan 2018 8:50 AM GMTతాను రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు సూట్ కానని నా ఇష్టం సినిమా టైములోనే గుర్తించిన రానా బాహుబలి నుంచి కథల సెలక్షన్ లో రొటీన్ కు భిన్నంగా వెళ్తూ తనేంటో ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. హిస్టారికల్ అయినా ఫాంటసీ అయినా లేక ఏదైనా డిఫరెంట్ జానర్ అయినా అందరికి రానానే బెస్ట్ ఛాయస్ గా మారుతున్నాడు. తాజాగా అలాంటి మరో సబ్జెక్ట్ ని రానా ఓకే చేసినట్టు తెలిసింది. 70వ దశకంలో తన దొంగాతనలతో తెలుగు రాష్ట్రాన్ని వణికించిన గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు బయోపిక్ లో నటించేందుకు రానా రెడీ అయ్యాడని టాక్. స్టువర్టుపురం గ్రామం ఎరుకల కులానికి చెందిన నాగేశ్వర్ రావు అప్పట్లో ఇళ్ళు - దుకాణాలు - సంస్థలు చాకచక్యంగా లూటీ చేయటంలో ప్రసిద్ధి గాంచాడు. ఆ కాలంలోనే తిరుపతి - వైజాగ్ - కాళహస్తి - హైదరాబాద్ వంటి పట్టణాల్లో ఈ నాగేశ్వర్ రావు పై లెక్కలేనన్ని కేసులు ఉండేవట.
1987 లో జరిగిన ఒక పోలీస్ ఎన్ కౌంటర్ లో టైగర్ నాగేశ్వర్ రావు మరణించాడు. ఇప్పుడు ఈ కథతోనే రానా హీరోగా సినిమా రాబోతోందని టాక్. రాజ్ తరుణ్ తో కిట్టు గాడు జాగ్రత్త సినిమా తీసిన వంశీ కృష్ణ దర్శకత్వంలో అనిల్ సుంకర దీన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. కథ చాలా బాగా వచ్చిందని. ఎగ్జైట్ చేసే అంశాలు చాలా ఉన్నందునే ఇది చేయాలని రానా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇందులో నాగేశ్వర్ రావు దొంగగా మారడానికి దారి తీసిన పరిస్థితులు మొదలుకుని అప్పుడు చేసిన సాహసాలతో సహా చివరికి ఎలా చంపబడ్డాడు మొత్తం ఇందులో ఉంటుందని టాక్.
స్టువర్టుపురం దొంగలను నేపధ్యంగా తీసుకుని గతంలో రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. ఒకటి చిరంజీవి హీరోగా యండమూరి దర్శకత్వంలో వచ్చిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ కాగా భానుచందర్ హీరోగా వచ్చిన స్టువర్టుపురం దొంగలు రెండోది. చిరుది ఫ్లాప్ కాగా భాను చందర్ మూవీ మంచి హిట్ గా నిలిచింది. కాని ఆ రెండు కల్పిత కథలు. ఇప్పుడు రానా చేయబోయేది మాత్రం రియల్ స్టొరీ.