Begin typing your search above and press return to search.

భయపెట్టే దర్శకుడితో రానా సినిమా?

By:  Tupaki Desk   |   15 March 2018 4:30 AM GMT
భయపెట్టే దర్శకుడితో రానా సినిమా?
X
బాహుబలి తెచ్చిన పేరు రానాలో పెద్ద మార్పే తీసుకొచ్చింది. ఒకే రకమైన పాత్రలకు కట్టుబడకుండా రకరకాల ప్రయోగాలకు, కొత్త దర్శకులతో పని చేయడానికి దగ్గుబాటి కుర్రాడు మంచి ఉత్సాహం చూపిస్తున్నాడు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా టిపికల్ అనిపించే వాటిని ఏరి కోరి మరీ చేస్తున్న రానా తాజాగా మరో ఎక్స్ పెరిమెంట్ కూడా చేయబోతున్నట్టు తెలిసింది. ఇటీవలే సిద్ధార్థ్ తో గృహం లాంటి బ్లాక్ బస్టర్ హారర్ మూవీ ఇచ్చిన దర్శకుడు మిలింద్ రాయ్ తో పని చేయడానికి ఉత్సాహపడుతున్నట్టుగా తెలిసింది. హారర్ కామెడీతో విసుగెత్తిన జనాలకి కొత్త తరహా సీరియస్ హారర్ తో భయపెట్టడంలో మిలింద్ మంచి విజయం సాధించాడు. తెలుగులో కూడా గృహం చెప్పుకోదగ్గ వసూళ్లు తెచ్చుకుంది.

మిలింద్ రాయ్ చెప్పిన స్టొరీ లైన్ రానాను బాగా ఇంప్రెస్ చేసిందని అందుకే ఆసక్తి చూపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇది హారర్ జానరా లేక ఇంకేదైనా కొత్త తరహా స్టొరీ ఎంచుకున్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హాతీ మేరీబ్ సాతి కోసం సిద్ధమవుతున్న రానా అది పూర్తయ్యే లోపే ఇది మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రానా ఓకే చెప్పగానే ద్విబాషల్లో ఇది మొదలు కానుంది. కాని ఎప్పుడు స్టార్ట్ అయ్యేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. యాంకరింగ్ తో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తున్న రానా తన మల్టీ టాలెంట్స్ ని అన్ని ప్లాట్ ఫార్మ్స్ లో చూపిస్తున్నాడు. సినిమాల్లోనే కాక అన్ని రకాలుగా తనను తాను ఎక్స్ ప్లోర్ చేసుకుంటున్న రానాను బిగ్ బాస్ సీజన్ 2 కోసం యాంకర్ గా తీసుకునే ఆలోచనలో స్టార్ మా ఉన్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి కాని రానా కాని అటు ఛానల్ వర్గాలు కాని దీని గురించి నోరు విప్పలేదు.