Begin typing your search above and press return to search.

రానా 'ట్రైన్ టికెట్ టైగ‌ర్‌'.. కానీ సస్పెన్స్‌!

By:  Tupaki Desk   |   4 Jan 2023 6:56 AM GMT
రానా ట్రైన్ టికెట్ టైగ‌ర్‌.. కానీ సస్పెన్స్‌!
X
విభిన్న‌మైన సినిమాల‌తో హీరోగా, స‌పోర్టింగ్ ఆర్టిస్ట్ గా, విల‌న్ గా ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు టాలీవుడ్ హంక్ రానా. 'విరాట ప‌ర్వం' త‌రువాత రానా న‌టించిన సినిమా ఏది థియేట‌ర్ల‌లోకి రాలేదు. నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయ్ వెంక‌టేష్ తో క‌లిసి 'రానా నాయుడు' వెబ్ సిరీస్ లో న‌టించిన రానా ఆ త‌రువాత మ‌రో తెలుగు సినిమాకు గ్రీన‌ప్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. త‌న పుట్టిన రోజున అయినా రానా నుంచి క్రేజీ అప్ డేట్ వ‌స్తుందేమోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు.

కానీ అదీ జ‌ర‌గ‌లేదు. 'రానా నాయుడు' తెలుగు టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసిన రానా ఫ్యాన్స్ ని నిరాశ ప‌రిచాడు. ఇంత‌కీ రానా ఏ సినిమా చేయ‌బోతున్నాడు?.. ద‌ర్శ‌కుడు ఎవ‌రు? .. ఎందుకింత స‌స్పెన్స్ ని మెయింటైన్ చేస్తున్నాడు? అనే చ‌ర్చ అభిమానుల్లో మొద‌లైంది.

ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 4 బుధ‌వారం సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా రానా షేర్ చేసిన పోస్ట్ ఆస‌క్తిక‌రంగా మారింది. 'ట్రైన్ టికెట్ టైగ‌ర్‌' అంటూ ఓ పోస్ట‌ర్ ని అభిమానుల‌తో పంచుకున్నాడు రానా.

రైల్వే ట్రాక్ పై ప‌క్క‌న రైలు వెళుతుండ‌గా చార‌ల లుంగీపై టికెట్ క‌లెక్ట‌ర్ కాస్ట్యూమ్ ధ‌రించి.. గాగుల్స్ పెట్టుకుని క‌నిపిస్తున్న రానా లుక్ ఆక‌ట్టుకుంటోంది. ఈ పోస్ట‌ర్ కి రానా రేపు మీ స్క్రీన్ ల‌పై ప్రీమియ‌ర్ కాబోతోంది అంటూ క్యాప్ష‌న్ ఇవ్వ‌డంతో ఇది ఎక్క‌డ, ఎందులో స్ట్రీమింగ్ కానుంద‌న్న‌ది ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

ఓటీటీ కోసం రానా చేశాడా? .. అయితే ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది? అన్న‌ది మాత్రం రానా స‌స్పెన్స్ లో పెట్ట‌డంతో ఫ్యాన్స్ కొంత క‌న్ఫ్యూజ‌న్ కు గుర‌వుతున్నారు.

గురువారం రానా ఎలాంటి స‌ర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు? .. ఎందుకు స‌స్పెన్స్ ని మెయింటైన్ చేస్తున్నాడ‌న్న‌దానిపై క్లారిటీ రానుంది. ఇదిలా వుంటే RRR లో రే స్టీవెన్ స‌న్ కు వాయిస్ అందించిన రానా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వ‌న్ 1' తెలుగు వెర్ష‌న్ కు న‌రేట‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. 'విరాట ప‌ర్వం' త‌రువాత రానా హీరోగా ఇంత వ‌ర‌కు మ‌రో ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.