Begin typing your search above and press return to search.

రానా రూట్ ఇక మాస్ మ‌సాలా అంటారా?

By:  Tupaki Desk   |   16 Jun 2022 1:30 PM GMT
రానా రూట్ ఇక మాస్ మ‌సాలా అంటారా?
X
టాలీవుడ్ హంక్ రానా డిఫ‌రెంట్ అటెంప్స్ట్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌మర్శియ‌ల్ స్టార్ గా అత‌నెప్పుడు స‌క్సెస్ అవ్వాల‌ని ఆరాట ప‌డ‌లేదు. త‌న‌లో యూనిక్ ట్యాలెంట్ ని బ‌య‌ట‌కు తేవాల‌ని కొత్త ప్ర‌యోగాల‌కే మెగ్గు చూపుతారు. త‌న‌లో ఆ ప్ర‌తిభ‌ని గుర్తించే బాలీవుడ్ సైతం అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించింది. టాలీవుడ్ లో ఏ హీరో చేయ‌న‌ని హిందీ సినిమాలు తెలుగు హీరో అయిన రానా చేయ‌గ‌ల‌గ‌డం విశేషం.

ఆయ‌న‌కు తెర‌పై పాత్ర మాత్ర‌మే క‌నిపిస్తుంది. అది నెగిటివ్ రోలా..పాజిటివ్ రోలా? అన్న‌ది తెలియదు. అలాంటి ఫ్యాష‌న్ గ‌ల న‌టుడు కాబ‌ట్టే `బాహుబ‌లి`లో భ‌ల్లాల దేవుడయ్యాడు..`ఘాజీ` లాంటి చ‌రిత్ర‌ని వెలికి తీయ‌గ‌లిగారు. ఇప్పుడు `విరాట‌ప‌ర్వం`లో న‌క్స‌లైట్ గా..అమ‌ర ప్రేమికుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఇది రానా చేస్తోన్న అతి పెద్ద ప్ర‌యోగం.

1990 కాలం నాటి మావోయిస్ట్ లీడ‌ర్ గా క‌నిపించ‌నున్నారు. వ్య‌వ‌స్థ‌లో మార్పు కోరే సిస‌లైన అన్న పాత్ర‌లో మెప్పించ‌నున్నారు. అయితే ఈ సినిమా ఒప్పుకునే క్ర‌మంలో రానా అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త‌ని ఎదుర్కున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా చేయోద్ద‌ని తెలంగాణ అభిమానులు కొంత మంది విజ్ఞ‌ప్తి చేసారు.

కానీ కమిట్ అయిన ప్రాజెక్ట్ ని మ‌ధ్య‌లోనే వ‌దిలేయ‌డం వీరుడి ల‌క్ష‌ణం కాదు కాబ‌ట్టి దాన్ని ఎలాగూ రానా పూర్తి చేయ‌గ‌లిగారు. అయితే ప్రీ రిలీజ్ వేడుక‌లో రానా మాట‌ల్ని బ‌ట్టి భ‌విష్య‌త్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక పై అభిమానులు మెచ్చే సినిమాలు మాత్ర‌మే చేస్తాన‌ని...`విరాట ప‌ర్వం` లాంటి సినిమాలు చేయ‌న‌ని గ‌ట్టిగానే చెప్పారు.

దీన్ని బ‌ట్టి `విరాట ప‌ర్వం`లో రానా రోల్ ఎలా ఉంటుంది? అన్న ఉత్సాహం ఓవైపు ఉంటే..మ‌రోవైపు అత‌ని ఇమేజ్ ని ఈ సినిమా దెబ్బ తీస్తుందా? అన్న సందేహం కూడా తెర‌పైకి వ‌స్తుంది. రానా అస‌లు ఇలాంటి సినిమాలు చేయ‌న‌ని ఎందుక‌న్న‌ట్లు? అన్న వాద‌న నెట్టంట బ‌లంగా మొద‌లైంది. రానా ని కేవ‌లం డిఫ‌రెంట్ చిత్రాల్లో మాత్ర‌మే ఊహించుకునే ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ ఉన్నారు.

అత‌ను క‌త్తి ప‌ట్టి బాల‌య్య మాదిరి హీరోయిజం చూపించినా...సుమ్మోలు గాల్లో లేచేలా భీభ‌త్సం సృష్టించినా రానా యూనిక్ ఐడెంటీని కోల్పోయిన‌ట్లే. కొన్ని సంవత్స‌రాల పాటు క‌ష్ట‌ప‌డి నిర్మించున‌కున్న ప్ర‌త్యేక‌మైన గుర్తింపుపై నీళ్లు చ‌ల్లిన‌ట్లే అవుతుంది. మ‌రి రానా తాజా నిర్ణ‌యంపై ఓ సారి పున‌రాలోచిస్తారామే చూడాలి.