Begin typing your search above and press return to search.

రామానాయుడు జ‌యంతి.. వెంకీ-రానా ఎమోష‌నల్

By:  Tupaki Desk   |   7 Jun 2022 4:19 AM GMT
రామానాయుడు జ‌యంతి.. వెంకీ-రానా ఎమోష‌నల్
X
మ‌ద్రాసు నుంచి తెలుగు సినీప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ కి త‌ర‌లి రావ‌డంలో ద‌గ్గుబాటి రామానాయుడు పాత్ర ఎంతో కీల‌క‌మైన‌ది. ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాసరి నారాయ‌ణ‌రావు .. ఏఎన్నార్ - ఎన్టీఆర్ వంటి దిగ్గ‌జాల‌తో క‌లిసి రామానాయుడు నాటి రోజుల్లో అజేయ‌మైన‌ ప్ర‌య‌త్నం చేసారు. హైద‌రాబాద్ లో రామానాయుడు స్టూడియోస్ ని ఏర్పాటు చేసి సినీరంగానికి ఎన్నో సేవ‌లందించారు.

అగ్ర నిర్మాత‌గా స్టూడియో య‌జ‌మానిగా పంపిణీదారుగా ప‌రిశ్ర‌మ ఎదుగుద‌లలో భాగ‌మ‌య్యారు. ఆయ‌న న‌టుడిగా ద‌ర్శ‌కుడిగానూ రాణించారు. బ‌హుభాష‌ల్లో సినిమాల‌ను నిర్మించి గిన్నిస్ రికార్డ్ ను అందుకున్నారు. 13 భాష‌ల్లో ఆయ‌న దాదాపు 150 సినిమాలు నిర్మించి అరుదైన నిర్మాత‌గా రికార్డుల‌కెక్కారు.

జూన్ 6న లెజెండ‌రీ రామానాయుడు దగ్గుబాటి జయంతి సంద‌ర్భంగా విక్ట‌రీ వెంక‌టేష్‌.. ద‌గ్గుబాటి రానా ఎంతో ఎమోష‌న‌ల్ గా సోష‌ల్ మీడియాల్లో నివాళుల‌ర్పించారు. రామానాయుడు మనవడు రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా లో ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి తన తాతతో త్రోబాక్ ఫోటోని పంచుకున్నాడు. ఆ ఫోటోగ్రాఫ్ కి `మై స్పిరిట్` అని క్యాప్షన్ పెట్టాడు. ఫోటోలో తాత‌ రామానాయుడు చెంత‌నే రానా కెమెరాలకు పోజులిస్తూ క‌నిపించారు.

రామానాయుడు తనయుడు వెంకటేష్ దగ్గుబాటి కూడా తన తండ్రి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అతను తన తండ్రితో క‌లిసి ఉన్న మోనోక్రోమ్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసారు``లవ్ అండ్ మిస్ యు ఎల్లప్పుడూ నానా. #DRNజ‌యంతి`` అని వెంకీ ఎమోష‌న‌ల్ అయ్యారు.

డా.డి.రామానాయుడు టాలీవుడ్ ని నిర్మించిన లెజెండ్ లలో ఒకరు. టాలీవుడ్ కి భారతీయ సినిమాకు ఆయన చేసిన సహకారం లెజెండ్ గా ఆవిష్క‌రించింది. రామానాయుడు స‌మ‌కాలీన సినీప్ర‌పంచంలో దూరదృష్టి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ద‌శాబ్ధాల కాలంలో బ‌హుభాషలలో చిత్రాలను నిర్మించారు. బాపట్ల నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన ఆయన చురుకైన రాజకీయ నాయకుడిగా కూడా పేరు పొందారు. రామానాయుడు పెద్ద కుమారుడు డి.సురేష్ బాబు అగ్ర నిర్మాత‌గా త‌న తండ్రి హోదాను లెగ‌సీని కాపాడుతూ అజేయంగా ఎదిగారు. రెండో కుమారుడు విక్ట‌రీ వెంక‌టేష్.. మ‌న‌వ‌డు రానా టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా కొన‌సాగుతున్నారు.

ఇదిలా ఉంటే.. వెంకీ `ఎఫ్ 3` త‌ర్వాత‌ త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టి సారించారు. బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ తో క‌లిసి ఓ చిత్రంలో న‌టించ‌నున్నారు. రానా దగ్గుబాటి సాయి పల్లవితో కలిసి నటించిన విరాట పర్వం విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ విడుదలై ఆక‌ట్టుకుంది. రానా `అరణ్య` అని పిలుచుకునే కామ్రేడ్ రవన్న పాత్రను పోషిస్తుండగా.. సాయి పల్లవి అతని అభిమాని వెన్నెలగా కనిపిస్తుంది.