Begin typing your search above and press return to search.

ఆనంతపద్మనాబ కథలో బాహుబలి విలన్

By:  Tupaki Desk   |   30 Jan 2018 4:13 AM GMT
ఆనంతపద్మనాబ కథలో బాహుబలి విలన్
X
టాలీవుడ్ లో ప్రస్తుతం రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే హీరోల్లో బాహుబలి విలన్ రానా దగ్గుబాటి టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ఎక్కువగా చరిత్రాత్మక కథల వైపు రానా మొగ్గు చూపుతున్నాడు. అంతే కాకుండా నిర్మాతలకు బయ్యర్లకు కూడా మంచి లాభాలను అందిస్తూ.. తన మార్కెట్ పరిధిని కూడా పెంచుకుంటున్నాడు. కేవలం ప్రాజెక్టును మాత్రమే నమ్ముతూ దర్శకుడికి కూడా ఈ బలాన్ని ఇస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ కథలు వస్తే రానా చాలా సున్నితంగా తిరస్కరిస్తున్నాడు.

అంతే కాకుండా ఆ దర్శకులకు కొత్త తరహా కథతో వస్తే చేస్తాను అనే ఒక భరోసా కూడా ఇస్తున్నాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. రానా రీసెంట్ గా మరొక చరిత్రాత్మక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా మలయాళం నుంచి ఆఫర్ అందుకోవడం విశేషం. ట్రావన్ కోర్ మహారాజు మార్తాండ వర్మ కథ ఆధారంగా మలయాళంలో ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనుంది. ఆనంతపద్మ నాబ స్వామి దేవాలయన్నీ నిర్మించింది..అందులో ధనాన్ని దాచింది ఈ రాజే. అయితే ఆ కథకు రానా అయితేనే బెస్ట్ అని చిత్ర యూనిట్ డిసైడ్ చేయడంతో రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

రీసెంట్ గా కేరళకు వెళ్లిన రానా అక్కడ ఆనంతపద్మ నాబా స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. దేవాలయాన్ని సందర్శించిన అనంతరం కథ గురించి వివరణాత్మకంగా తెలుసుకోవడానికి రాజులకు సంబంధించిన కుటుంబాలని కలుసుకొని వారి గురించి తెలుసుకున్నాడు. అంతే కాకుండా కేరళలోని ప్రముఖ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను స్థావరాలను పరిశీలించి అవి ఎంతవరకు నిజం అనే విషయంలో క్లాటిటి కోసం సందర్శించాడట. మరి కొన్ని నెలల్లోనే రానా ఆ సినిమాను సెట్స్ పైకి తిసుకెళ్లాలని చిత్ర యూనిట్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.