Begin typing your search above and press return to search.

రానా-నాని గొడవ.. వెంకటేష్‌ క్లాస్

By:  Tupaki Desk   |   30 May 2017 6:42 AM GMT
రానా-నాని గొడవ.. వెంకటేష్‌ క్లాస్
X
''అసలు పొడుగు ఉంటే స్టార్ హీరోలు అయిపోతారా? అంత పొడుగు ఉండి బాడీ బాగుంటే హీరో ప్రక్కన బౌన్సర్ అవుతారంతే''.. ఇది రానా దగ్గుబాటి గురించి నాని చేసిన కామెంట్. ''నెలకి ఒక సినిమా రిలీజ్ చేస్తే హీరో అయిపోతాడా? న్యాచురల్ స్టార్ అనడానికి వాడేమన్నా భూమిలో దొరికే ఖనిజం కాదుగా. వాడు స్టారేంటండీ బాబూ?'' ఇది నవీన్ బాబు ఘంటా ఎలియాస్ నాని గురించి రానా చేసిన కామెంట్.

ఐఫా 2017 అవార్డుల సందర్భంగా ఈ హీరోలిద్దరూ ఇలా కామెంట్లు చేసుకున్నారు. ఇది సరదాసరదాకే చేసినా కూడా.. ఇందులో కొన్ని నిజంగానే నిజంగా అనిపించేశాయి తెలుసా!! ఇకపోతే ఈ కామెడీ స్కిట్ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నించారు రానా అండ్ నాని. ''మా నాన్న లేకపోతే నువ్వు హీరో అయ్యేవాడివి కాదురా'' అని నానిని ఉద్దేశించి రానా అంటే.. ''ఇంట్లో నిన్ను పెట్టుకుని కూడా మీ బాబు నాకు ఛాన్సు ఇచ్చాడంటే నీ సంగతి చూస్కో అసలు'' అంటూ నాని కౌంటర్ వేశాడు. ఇలా వీరు వాగ్విదాం చేస్తుండగా.. అక్కడకి వచ్చిన విక్టరీ వెంకటేష్‌ వీరికి క్లాస్ పీకాశాడులే.

''ఉరేయ్.. మెగాస్టార్ 150 సినిమా ఎంజాయ్ చేశాం. బాలయ్య సమయం లేదు మిత్రమా అంటే ఎంజాయ్ చేశాం. అక్కడ నాగ్ ఉన్నాడు చూడండి.. 25 ఏళ్ల కుర్రాడిలా.. మీరు ఎందుకైనా పనికొస్తార్రా? మేము ఎప్పుడూ కలసిమెలసి ఉంటాం. పాజిటివ్ గా థింక్ చేస్తాం. మీ యంగ్ జనరేషన్ ఏంట్రా ఇంత నెగెటివ్ గా ఉన్నారు. పాజిటివ్ గా ఉండండ్రా'' అంటూ క్లాసిచ్చాడు వెంకీ. ఈ స్కిట్ మొత్తానికి ఈ క్లయ్ మ్యాక్స్ అదిరింది.

నిజానికి యంగ్ జనరేషన్ అంతా గ్రూపుల మీద గ్రూపులు కట్టేసి నానా రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ ఫ్యామిలీస్ నుండి వచ్చిన హీరోలు క్యాస్టుల పరంగా రెండు గ్యాంగులుగా సెపరేట్ అయిపోగా.. వీరిలో కొందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రం రెండు గ్యాంగుల్లో ఉంటున్నారు. ఇక యంగ్ హీరోస్ లో కూడా రెండు గ్యాంగులున్నాయి. అలాగే ఇంకా ఇంకా యంగ్ హీరోల్లో కూడా ఒక గ్యాంగ్ ఉంది. మరి వీళ్ళకు వెంకీ పాజిటివ్ మెసేజ్ అందిందా??




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/