Begin typing your search above and press return to search.

భల్లాల.. బెంగళూర్ నుంచి వచ్చేశాడు

By:  Tupaki Desk   |   8 Oct 2015 1:30 AM GMT
భల్లాల.. బెంగళూర్ నుంచి వచ్చేశాడు
X
దగ్గుబాటి రాణా మొత్తానికి ఫ్రీ అయ్యాడు. మళయాళ సూపర్ హిట్ మూవీ బెంగళూర్ డేస్ తమిళ్ రీమేక్ చేస్తున్నాడు రాణా. రాణాతోపాటు ఆర్య - బాబీ - సమంతలు లీడ్ రోల్స్ చేస్తున్నారు ఈ మూవీలో. తెలుగులోనూ తీస్తారని భావించినా.. ఆర్య, సమంత, రాణాలు తెలుగోళ్లకి బాగా తెలిసినోళ్లే కావడం, దీన్ని డైరెక్ట్ చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ కి తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరుండడంతో... డబ్బింగ్ తో సరిపెట్టేస్తున్నారు.

ప్రస్తుతం ఈ బెంగళూర్ డేస్ షూటింగ్ పూర్తయిపోయిందని రాణా స్వయంగా ట్వీట్ చేశాడు. నిజానికి రాణా ఈ మూవీని ఒప్పుకుని ఉండకపోతే.. ఇప్పటికే బాహుబలి 2 షూటింగ్ లో ఉండేవాడు. హీరో ప్రభాస్ అందుబాటులోనే ఉన్నా.. షూటింగ్ తీయాల్సిన పార్ట్ లో రాణా పాత్ర చాలా కీలకం. దీంతో ఇప్పటివరకూ బాహుబలి సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లలేదు.

కేవలం రాణా ఒక్కడి వల్లే లేట్ అయిందని అనుకోవడానికి లేదు. బాహుబలిని అనేక దేశాల్లో విడుదల చేస్తూ, ప్రమోట్ చేస్తూ.. జక్కన్న కూడా బిజీగానే ఉంటున్నాడు. కానీ ఇలా మిగిలిన వాళ్లు లేట్ చేస్తుండడంతో... ప్రభాస్ కి నెక్ట్స్ వెంచర్ కి వెళ్లేందుకు బాగా లేట్ అవుతోంది. ఈ విషయం పై రెబల్ స్టార్ గుర్రుగా ఉన్నాడని తెలుస్తోంది.