Begin typing your search above and press return to search.

రానా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నార‌ట‌

By:  Tupaki Desk   |   22 Feb 2022 2:30 PM GMT
రానా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నార‌ట‌
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ , రానా ద‌గ్గుబాటి తొలి సారి క‌లిసి న‌టించిన చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అన్నీ తానై త్రివిక్ర‌మ్ ఈ ప్రాజెక్ట్ ని ముందుకు న‌డిపించారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై యంగ్ ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. నిత్యామీన‌న్, సంయుక్త మీన‌న్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ విష‌యంలో రానాని హైడ్ చేస్తున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ వార్త‌ల‌కు చెక్ పెడుతూ తాజాగా `భీమ్లా నాయ‌క్` ట్రైల‌ర్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ మూవీ ట్రైల‌ర్ సోమ‌వారం రాత్రి 9 గంట‌ల‌కు విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ లో రానా ఫ్యాన్స్ లాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కూడా ట్రైల‌ర్ లో రానా కు ప్రాధాన్య‌త వుంటుంద‌ని ఊహించ‌లేదు. కానీ వారు ఊహించ‌నిదే జ‌రిగింది. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా రూపొందిన ఈ మూవీలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రానా పాత్ర‌ల‌కు స‌మాన ప్రాధాన్య నిచ్చారు. అది ట్రైల‌ర్ లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

మెఉందు ఈ మూవీ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ ని ప‌వ‌న్ ఇమేజ్ కి అనుగునంగా మార్పులు చేర్పులు చేశార‌ని, సినిమాలో రానా పాత్ర‌ని ప‌వ‌న్ డామినేట్ చేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ విష‌యంలో రానా ఫ్యాన్స్ గ‌త కొన్ని రోజులుగా ఫీల‌వుతున్నారు కూడా. `భీమ్లా నాయ‌క్‌` ప్ర‌మోష‌న్స్ ఎప్పుడైతే మొద‌ల‌య్యాయో అప్ప‌టి నుంచి మేక‌ర్స్ పోస్ట‌ర్ ల‌లో ప‌వ‌న్ - రానాల‌కు స‌మాన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం మొద‌లుపెట్టారు. ఇంత‌కు ముందు రానాకు పోస్ట‌ర్ లో ప‌వ‌న్ తో స‌మానంగా ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఆ పోస్ట‌ర్ ని ట్యాగ్ చేస్తూ ప్రొడ్యూస‌ర్ ని నిల‌దీయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌తంలో రానాకు ప్రాధాన్య‌త త‌గ్గుతోందంటూ ప్రొడ్యూస‌ర్ పై కామెంట్ లు చేసి ఫ్యాన్స్ అంతా ఇప్ప‌డు హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌. ట్రైల‌ర్ రిలీజ్ త‌రువాత ఇందులో రానాకు ఇచ్చిన ప్రాధాన్య‌త‌ని గ‌మ‌నించిన ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నార‌ట‌. తాజాగా రిలీజ్ చేసిన `భీమ్లా నాయ‌క్ ` ట్రైల‌ర్ లో ప‌వ‌న్ తో పాటు రానా కూడా హలైట్ అయ్యాడు. ట్రైల‌ర్ లో రానాకి సంబంధించిన పిక్స్ ని క‌ట్ చేసిన ఆయ‌ర ఫ్యాన్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ చేస్తూఊ సెల‌బ్రేట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.

డానియ‌ల్ శేఖ‌ర్ గా రానా లుక్ ప‌ర్ఫెక్ట్ గా వుండ‌టం.. ట్రైల‌ర్ లోని కీల‌క ఘ‌ట్టాల్లో రానా ని చూపించిన తీరు ప‌వ‌న్ కు ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో ప‌వ‌ర్ ఫుల్ గా వుండ‌టంతో రానా అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నార‌ట‌. అంతే కాకుండా రానా ఈ మూవీకి ప్ర‌ధాన బ‌లంగా నిల‌వ‌డం కూడా ఫ్యాన్స్ కి ఆనందాన్ని క‌లిగిస్తోంద‌ని చెబుతున్నారు. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ ఈ నెల 25న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని హిందీలోనూ మేక‌ర్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.