Begin typing your search above and press return to search.
రానా ఫ్యాన్స్ అనుమానాలు పటాపంచలు!
By: Tupaki Desk | 27 Feb 2022 10:37 AM GMTపవన్ కల్యాణ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'భీమ్లా నాయక్' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా మలయాళంలో కొంతకాలం క్రితం వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కి రీమేక్.
ఒక ఫారెస్టు ప్రాంతంలో పోలీస్ ఆఫీసర్ కీ .. రాజకీయంగా ఎదగాలనుకుంటున్న వ్యక్తికి మధ్య జరిగే ఇగో వార్ ఇది. సహజత్వానికి చాలా దగ్గరగా పాత్రలను మలచినతీరు ప్రశంసలను అందుకుంది.
మలయాళంలో ఈ రెండు పాత్రల పేర్లను కలుపుతూ టైటిల్ సెట్ చేయడం జరిగింది. తెలుగులో కూడా అలాగే జరుగుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ తెలుగులో పవన్ వైపు నుంచే టైటిల్ పెట్టారు. పవన్ కి సంబంధించిన అప్ డేట్స్ ను ముందుగా వదిలారు. పోస్టర్ల పరంగా .. వీడియోల పరంగా పవన్ పాత్రను హైలైట్ చేశారు.
దాంతో రానా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. రానా పాత్రను తగ్గిస్తున్నారనీ .. ఆ పాత్రకి గల ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. రానా ఈ సినిమాను ఒప్పుకోకుండా ఉండవలసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ విషయంపై సోషల్ మీడియాలో బాగానే రచ్చ జరిగింది. సినిమా విడుదల తరువాత రానా ఫ్యాన్స్ వైపు నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం ఖాయమని చాలామంది అనుకున్నారు. కానీ సినిమా చూసిన తరువాత రానా పాత్రకి తగిన న్యాయం జరిగిందనీ .. ఆ పాత్రను ఆయన అద్భుతంగా చేశాడని అభిమానులు అంటున్నారు.
కోపం .. ద్వేషం .. పొగరు ఉన్న డేనియల్ శేఖర్ పాత్రలో రానా చెలరేగిపోయాడని చెబుతున్నారు. పవన్ తో సమానంగా రానా తన పాత్రను పండించాడని అంటున్నారు. లుక్ పరంగా .. యాక్టింగ్ పరంగా అదరగొట్టేశాడని కితాబునిస్తున్నారు.
ఈ సినిమా ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు పవన్ ఫ్యాన్స్ .. అటు రానా అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను సమానంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కారణంగానే ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.
ఇక ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తూ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అభిమానులకు .. ఈ సినిమాలో తనకి అవకాశం ఇచ్చిన సితార బ్యానర్ వారికీ .. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఓకే చెప్పిన పవన్ కి రానా సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశాడు.