Begin typing your search above and press return to search.
భీకరమైన అడవి దున్నతో రానా పోరు
By: Tupaki Desk | 11 April 2015 4:59 AM GMTమదమెక్కిన మత్తగజాన్ని సైతం భయపెట్టే వాడి వేడి ఉన్న భీకర మృగం బిషన్ (అడవి దున్న). మెలితిరిగిన సూదంటు కొమ్ములు.. భారీ మూపురం.. దృఢమైన శరీరం, బలమైన కదలిక ఉన్న ప్రత్యేకమైన అడవి జంతువు ఇది. ఇలాంటి జంతువును ఢీకొట్టాలంటే పది సింహాలైనా భయపడతాయి. ఎదురుగా వెళితే పనే జరగదు. వెనుకనుంచి నక్కి నక్కి దాడి చేసి మట్టుపెట్టాల్సిందే. అలాంటి ప్రమాదకరమైన జంతువును ధీరుడిలా ఎదుర్కొన్నాడు రానా దగ్గుబాటి.
మీది మీదికి లంఘించుకుంటూ దూసుకొచ్చే ఆ భీకర జంతువును ఎలా ఎదుర్కొన్నాడు? ఎక్కడ ఎదుర్కొన్నాడు? అన్నదే మీ సందేహమే అయితే దానికి సమాధానం 'బాహుబలి'. ఈ చిత్రంలో ఓ భీకరమైన అడవి దున్నతో పోరాట సన్నివేశం ఒకటి ఉంది. అందులో రానా ఈటె పట్టుకుని దున్న వెంట పరిగెత్తుతాడు. వెంబడిస్తాడు. అది ఎదురు తిరిగితే హీరోచితంగా పోరాడి చివరకి దానిని హతమారుస్తాడు. అయితే నిజంగానే అలాంటి ఒక దున్నతో పోరాడాలంటే మానవమాత్రుల వల్ల కానే కాదుగా మరి..
అందుకే దానిని గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేశారు. వర్ణ సినిమాలో ఓ బీస్ట్ (క్రూర మృగం)తో అనుష్క పోరాడుతుంది. తనమీదికి లంఘించిన బీస్ట్‌ని ఒకే ఒక్క కత్తి పోటుతో సులువుగానే చంపేస్తుంది. అలా కాకుండా రానా కాస్త ఎక్కువగానే పోరాడి అడవి దున్నను మట్టుపెడతాడని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలైట్‌గా ఉంటుందిట.