Begin typing your search above and press return to search.
రోజుకి 20 గంటలు నీళ్లలో షూటింగ్
By: Tupaki Desk | 25 Feb 2016 11:30 AM GMTబాహుబలి విలన్ గా తన మార్క్ యాక్టింగ్ ని చూపించిన దగ్గుబాటి రాణా.. ఇప్పుడు గాజీ చిత్రంలో నటిస్తున్నాడు. 1971 ఇండో-పాక్ వారం సమయంలో బంగాళాఖాతంలో మునిగిపోయిన సబ్ మెరైన్ పీఎన్ ఎస్ గాజీ.. ఈ చిత్ర కథాంశం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. జనవరి 3న మొదలైన గాజీ షూటింగ్.. ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన అండర్ వాటర్ సీన్స్ ను చిత్రీకరించారు.
రెండు స్పెషల్ సెట్స్ వేసి మరీ ఈ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. 'హైద్రాబాద్ లో రెండు పెద్ద సెట్స్ వేశాం. వీటిలో కొన్ని రోజుల నుంచి నేను అండర్ వాటర్ సన్నివేశాల్లో నటించాను. ఉదయం 6 నుంచి రాత్రి 2 వరకూ నీళ్లలోనే నానాల్సి వచ్చింది. ఇది కొంచెం ఇబ్బందే కానీ.. నేను సహజంగానే డైవర్ ని కావడంతో అంత సమస్య కాలేదు. ' అన్నాడు రాణా. గత నాలుగేళ్లు డైవింగ్ యాక్టివిటీలో పాల్గొనకపోవడంతో.. రెండు రోజుల పాటు రిహార్సల్స్ వేసి, ఆ తర్వాత అండర్ వాటర్ సీన్స్ లో పాల్గొన్నానని చెప్పాడు రాణా. బాహుబలి రోల్ కోసం బరువు పెరిగిన రాణా.. గాజీ కోసం చాలా వెయిట్ తగ్గాల్సి వచ్చింది.
అయితే.. ఈ తరహా మూవీ ఇండియాలో ఇదే మొదటిది కావడంతో.. దీని కోసం ఎంత కష్టమైనా పడాల్సిందే అని ఫిక్స్ అయ్యాడట రాణా. తెలుగు - హిందీల్లో తెరకెక్కుతున్న గాజీ.. తమిళ్ లోనూ డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుంది.