Begin typing your search above and press return to search.
ఎవరు చేసుకున్నా ప్రభాస్ చేసుకోడా?
By: Tupaki Desk | 14 May 2020 5:00 AM GMTడార్లింగ్ ప్రభాస్ పెళ్లెప్పుడు? పరిశ్రమలో సాటి హీరోలంతా పెళ్లితో ఓ ఇంటివాళ్లయిపోతున్నారు. ఇప్పటికే తన ఫ్రెండు గోపిచంద్ పెళ్లాడి ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. నేడు నిఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. నితిన్ డేట్ ప్రకటించేందుకు సిద్ధమైపోతున్నాడు. రానా సైతం లాక్ డౌన్ ముగియగానే తన పెళ్లి తేదీని ప్రకటిస్తాడు. తాను ప్రేమించిన మిహీకా బజాజ్ తో ఫిక్స్ చేసుకోబోతున్నాడు. అంతెందుకు నిర్మాత దిల్ రాజు సైలెంటుగా తిరిగి కొత్త ఫేజ్ లోకి అడుగు పెట్టారు. మునుముందు యువహీరోలంతా ఇదే దారిలో తేదీల్ని ప్రకటించేట్టే కనిపిస్తున్నారు.
నిన్న భళ్లాల దేవ రానాకి పెళ్లంట!! అని తెలియగానే.. వెంటనే స్వీటీ స్పందించిన తీరు అందరికీ షాకిచ్చింది. రానా తమ్ముడు పెళ్లికి సిద్ధమవుతున్నాడు. చాలా సంతోషంగా ఉందని స్వీటీ తెలిపింది. ``కంగ్రాట్యులేషన్స్ బ్రో....& మిహీకా బజాజ్.. విష్ యు బోత్ ఆల్ హ్యాపీస్.. మీపై మా ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలానే ఉంటాయి`` అంటూ స్వీటీ ఎగ్జయిట్ అయ్యింది. ప్రభాస్ మాత్రం రానా పెళ్లిపై ఎందుకనో ఇంకా స్పందించినట్టు లేడు. ఒకవేళ రానాని విష్ చేస్తే తన పెళ్లెపుడు? అని విసిగిస్తారనే అలా చేశాడా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇకపోతే మన యువహీరోలు అంతా పెళ్లి బంధంతో ఇంటివాళ్లయిపోతుంటే 35 బార్డర్ క్రాస్ చేసిన ప్రభాస్ - అనుష్క మాత్రమే ఏదీ చెప్పడం లేదు ఎందుకనో. ప్రభాస్ పెళ్లి కోసం పెదనాన్న కృష్ణంరాజు ఎంతో అటెన్షన్ తో ఉన్నారు. ఒక రకంగా ఇంట్లో చాలా కాలంగా పోరు పెడుతున్నా ఆ ఒక్కటీ అడగొద్దు ప్లీజ్ అంటూ ఎస్కేప్ అయిపోతున్నాడు. తన స్నేహితుడు రానా పెళ్లి కబురు తెలిశాక అయినా మారాడా? లేదో తెలీలేదు ఇంకా. అలాగే స్వీటీకి పెళ్లి సంబంధాలు చూశారని... త్వరలోనే పెళ్లికి సిద్ధమని కూడా ప్రచారమైపోయింది. ఏదేమైనా ఎవరేమనుకున్నా ఆ ఇద్దరు మిత్రులు మాత్రం తమ పెళ్లి కబురు ఇప్పట్లో చెప్పేట్టు లేరు. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ మాత్రం అస్సలు స్పందించడం లేదు ఎందుకనో!