Begin typing your search above and press return to search.

స్టేజ్ మీద రానా కన్నీళ్లు..

By:  Tupaki Desk   |   3 Aug 2017 11:02 AM GMT
స్టేజ్ మీద రానా కన్నీళ్లు..
X
ఎప్పుడూ సరదాగా కనిపించే యువ కథానాయకుడు దగ్గుబాటి రానా ఎమోషనల్ అయిపోయాడు. తన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’కి సంబంధించి ఏర్పాటు చేసిన వేడుకలో రానా వేదిక మీద మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన తాత రామానాయుడిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. కొంతసేపు రానాకు మాటలే రాలేదు.

‘నేనే రాజు నేనే మంత్రి’ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని.. ఇలాంటి సినిమాలో తన నటనను తాత చూడలేకపోతుండటం చాలా ఆవేదన కలిగిస్తోందని.. ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తోందని రానా చెప్పాడు. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులూ తన తాత గుర్తుకొస్తూనే ఉన్నాడని రానా తెలిపాడు. తన తాతతో తాను సినిమా చేయలేకపోయానన్న అసంతృప్తి కూడా తనను వెంటాడుతోందని రానా చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అలాగే తన బాబాయి వెంకటేష్ గురించి చెబుతూ.. ఆయన అభిమానులున్నారనే ధైర్యంతోనే తాను సినిమాల్లోకి వచ్చినట్లు చెబుతాడు. వాళ్లున్నారంటే.. హాలీవుడ్ సినిమాను కూడా హైదరాబాద్ లోనే చేస్తానని రానా అన్నాడు. రానా తండ్రి సురేష్ బాబు మాట్లాడుతూ.. తన తండ్రి వెళ్లిపోయాక కొంత కాలం నుంచి తమకు అన్నీ మంచే జరుగుతున్నాయని.. ఆయన పైన ఉండి తమ కోసం అన్నీ సెట్ చేస్తున్నారేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి విజయం సాధిస్తుందని సురేష్ ధీమా వ్యక్తం చేశాడు.