Begin typing your search above and press return to search.
కట్స్ లేకుండా ‘యు’ కొట్టేసిన ‘ఘాజీ’
By: Tupaki Desk | 2 Feb 2017 10:55 AM GMT1971లో ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన వార్ లో విశాఖపట్నం సమీపంలోని సముద్రంలో ‘పీఎన్ఎస్-ఘాజీ’ ఎలా విచ్ఛిన్నం అయిందో ఇప్పటికీ మిష్టరీనే. ఆ రహస్యం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ఘాజీ’. ఈ చిత్రం ఈ రోజు సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కోతలు వేయకుండా క్లీన్ ‘యు’ సర్ఠిఫికెట్ ను ఇచ్చారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు.. సినిమా యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తినట్టు సమాచారం.
అప్పటి వార్ ఎపిసోడ్ నేపథ్యంలో ఘాజీ అనే యుద్ధనౌక సెట్టింగ్ ను వేసి.. అత్యంత విలువైన సంకేతిక అంశాలను జోడించి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు సంకల్ప్. అతనే కథ.. స్క్రీన్ ప్లే రాసుకుని దర్శకత్వం వహించాడు. రానా... తాప్సీ... కె.కె.మీనన్.. అతుల్ కులకర్ణీ... ఓంపూరి.. నాజర్ తదితర భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పి.వి.పి.సినిమా మరియు మాట్నీ ఎంటర్టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని ఈనెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు. దేశభక్తితో నిండిన ఎన్నోథ్రిల్లింగ్ అంశాలను దర్శకుడు ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారని... కచ్చితంగా ఈ సినిమా తెలుగు.. హిందీ.. తమిళ భాషల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇటీవలే అనారోగ్యంతో మరణించిన ఓంపూరి నటించిన చిత్రం తెలుగులో ఇదే చివరిది కావడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/