Begin typing your search above and press return to search.
అక్కడ.. ఇక్కడ.. ఎక్కడ చూసినా ‘ఘాజీ’నే
By: Tupaki Desk | 16 Feb 2017 10:25 AM GMTఈ మధ్య తమ సినిమా కచ్చితంగా ఆడుతుందని కాన్ఫిడెన్స్ ఉంటే.. చాలా ముందుగానే ప్రివ్యూలు వేసేసి టాక్ బయటికి వచ్చేలా చేస్తున్నారు నిర్మాతలు. గత ఏడాది ‘పెళ్లిచూపులు’ విషయంలో ఈ స్ట్రాటజీ బాగా పని చేసింది. బాలీవుడ్లో ‘దంగల్’ సినిమా విషయంలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. ఫలితం అందుకు తగ్గట్లే వచ్చింది. ఇప్పుడు ‘ఘాజీ’ విషయంలోనూ ఇలాగే చేశారు. విడుదలకు కొన్ని రోజుల ముందే బాలీవుడ్ సెలబ్రెటీలు కొందరికి ప్రివ్యూలు వేశారు. రవీనా టాండన్ లాంటి వాళ్లు ఈ సినిమా చూడటమే ఒక గౌరవం అన్నట్లు మాట్లాడటంతో బాలీవుడ్లో ఈ సినిమాపై ముందే పాజిటివ్ బజ్ మొదలైంది. ‘దంగల్’కు కాకుండా ఓ సినిమాకు దేశవ్యాప్తంగా ముందే ఇంత పాజిటివ్ బజ్ క్రియేటవడం ఇప్పుడే అని చెప్పొచ్చు.
ఇక తెలుగు.. తమిళంలోనూ రెండు రోజుల ముందే ప్రివ్యూలు వేశారు. అన్ని చోట్లా ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. మన సెలబ్రెటీలు చాలామంది ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. మీడియాలో ఆల్రెడీ పాజిటివ్ రివ్యూలు పోటెత్తుతున్నాయ్. ఇది సినిమా మీద బాగా హైప్ పెంచుతోంది. ‘ఘాజీ’ బుకింగ్స్ ఓపెన్ అయినపుడు అంతగా రెస్పాన్స్ లేదు కానీ.. ఓవైపు సోషల్ మీడియాలో.. మరో వైపు వెబ్ మీడియాలో ఈ సినిమా గురించి అందరూ గొప్పగా చెబుతుండటంతో ఏముంది ఇందులో గొప్పదనం అన్నట్లు జనాలు బుకింగ్స్ మీద పడ్డారు. విశాఖపట్నం ఈ చిత్రానికి నేపథ్యం కావడంతో అక్కడ బుకింగ్స్ మరింత జోరుగా సాగుతున్నాయట. ఈ వీకెండ్ మొత్తానికి మల్టీప్లెక్సుల్లో బుకింగ్స్ అయిపోవచ్చినట్లు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లో కూడా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. మొత్తానికి ‘ఘాజీ’ ఊహించని స్థాయికి చేరేలా కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/