Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ బాక్సాఫీస్ పై రానా సోలో వార్..!
By: Tupaki Desk | 1 Feb 2017 7:55 AM GMTబాహుబలి తరువాత రానా అంటే తెలియనివారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సుపరిచిత నటుడిగా గుర్తింపు పొందాడు. రానా తాజా చిత్రం ఘాజీ విడుదలకు సిద్ధమౌతోంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలీవుడ్ లో కూడా ఈ ట్రైలర్ కి మాంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు విదేశాల్లో కూడా ఘాజీపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే, ఘాజీ ఓవర్సీస్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
యువీ క్రియేషన్స్ అనగానే అందరికీ ప్రభాస్ గుర్తొస్తాడు. అది ఆయన కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అంటారు. తెలుగులో హిట్ చిత్రాల నిర్మించిన అనుభవం యూవీకి ఉంది. అలానే, చాలా చిత్రాలను పంపిణీ కూడా చేస్తోంది. రానా తాజా చిత్రం ఘాజీ విదేశీ హక్కుల్ని యూవీ క్రియేషన్స్ సొంతం చేసుకుంది. విదేశాల్లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ చిత్ర విదేశీ హక్కుల్ని రూ. 2 కోట్లకు యూవీ సొంతం చేసుకోవడం విశేషం.
బాహుబలితో రానాకి ఓవర్సీస్ లో కూడా ఫ్యాన్స్ పెరిగారు. అయితే, రానా సోలో హీరోగా ఆ తరువాత సినిమాలేవీ రాలేదు. బాహుబలి తరువాత రానా సోలో హీరోగా విడులౌతున్న చిత్రం ఇదే. దీంతో ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర రానా సోలో సత్తా చాటుకుంటాడని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఘాజీ ఓవర్సీస్ రైట్స్, మాంచి ఫ్యాన్సీ ధరకే అమ్ముడయ్యాయి. మరి, ఘాజీ ఏ స్థాయి కలెక్షన్లను దక్కించుకుంటుందో వేచి చూడాలి.