Begin typing your search above and press return to search.

‘ఘాజీ’ రేంజ్... 3500 స్క్రీన్లు

By:  Tupaki Desk   |   16 Feb 2017 11:19 AM GMT
‘ఘాజీ’ రేంజ్... 3500 స్క్రీన్లు
X
బాహుబలి కంటే ముందే రానా బాలీవుడ్లో పాగా వేశాడనేదాంట్లో నో డౌట్. అయితే బాహుబలి తరువాత మరింత పాగా వేశాడనడంలో సందేహంలేదు. అందుకే రానా నటించే ప్రతి సినిమాను టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లోనూ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. అలానే కోలీవుడ్లోనూ అజిత్ తో కలిసి ఆరంభం... ఆర్యతో కలిసి ‘బెంగళూరు డేస్’ రీమేక్ లాంటి సినిమాల్లో నటించాడు రానా. ఆ తరువాత బాహుబలితో అక్కడ కూడా ఫేమస్ అయిపోయాడు.

సో.. ఇప్పుడు రానా మూడు పరిశ్రమలకు సుపరిచితుడే అన్నమాట. కావున్న రానా నటించిన తాజా మూవీ ‘ఘాజీ’ని ఈ తెలుగు.. హిందీ..తమిళ భాషల్లో ఓవర్సీస్ తో కలుపుకుని సుమారు 3500 స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సొంతంగానే ఈ సినిమాను సురేష్ బాబు సపోర్ట్ తో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. బాలీవుడ్లో అయితే కరణ్ జోహార్ భారీ ఎత్తున్న ఈ సినిమాను ఇప్పటికే ప్రమోట్ చేసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోకంటే.. బాలీవుడ్లోనే ఈ చిత్రం ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శించబడటానికి రెడీ అవుతోంది. ఓవర్సీస్ లో యువీ క్రియేషన్స్ తో కలిసి గ్రేట్ ఇండియా సినిమా వారు రిలీజ్ చేస్తోంది.

పీవీపీ.. మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఘాజీ చిత్రం ప్రీమియర్ షోలను ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్.. విజయవాడల్లో ప్రదర్శించారు. ఈ రోజు సాయంత్రం విశాఖపట్నంలో ప్రదర్శించనున్నారు. క్రిటిక్స్ నుంచి... సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసుకుంది ‘ఘాజీ’. బాహుబలి తరువాత అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శించబడటానికి రెడీ వుతున్న ఘాజీ... ఓవరాల్ గా ఎలాంటి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/