Begin typing your search above and press return to search.
‘ఘాజీ’ అక్కడ దూసుకెళ్లిపోతోంది
By: Tupaki Desk | 24 Feb 2017 5:52 AM GMTనెమ్మదిగా మొదలై.. బాక్సాఫీస్ రేసులో దూసుకెళ్తోంది ‘ఘాజీ’. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా అదరగొడుతోంది. ఈ సినిమాకు ప్రిమియర్ షోలు వేసినపుడు రెస్పాన్స్ అంతంతమాత్రంగానే కనిపించింది. మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ కావడంతో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అంతగా ఓన్ చేసుకోలేదు. కానీ ఈ సినిమాకు అద్భుతమైన టాక్ రావడంతో సీన్ మారిపోయింది. రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ యుఎస్ బాక్సాఫీస్ లోనూ ‘ఘాజీ’ అదరగొట్టింది.
ఈ సినిమా ఆల్రెడీ అమెరికాలో హాఫ్ మిలియన్ మార్కును దాటేయడం విశేషం. బుధవారం నాటికి ‘ఘాజీ’ అమెరికాలో 5.6 లక్షల డాలర్లు వసూలు చేసింది. ప్రిమియర్లకు వచ్చిన రెస్పాన్స్ తో పోల్చి చూస్తే ఇది చాలా పెద్ద మొత్తమే. వీక్ డేస్ లో సైతం ‘ఘాజీ’ స్టడీ కలెక్షన్లతో సాగుతోంది. ఫుల్ రన్లో 7-8 లక్షల డాలర్ల మధ్య ఈ సినిమా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక ఇండియాలో ఈ చిత్రం రూ.25 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉంది. ఇక్కడ కూడా వీక్ డేస్ లోనూ రెస్పాన్స్ బాగుంది. ఫుల్ రన్లో రూ.40 కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోంది. పీవీపీ సినిమా.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కొత్త కుర్రాడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధానికి ముందు పాక్ సబ్ మెరైన్ ఘాజీ కూల్చివేత నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/