Begin typing your search above and press return to search.
యాంకర్ చెయ్యమంది. నేను చేశాను.
By: Tupaki Desk | 10 Aug 2017 1:03 PM GMTనేనే రాజు నేనే మంత్రి... అన్నంత సింపుల్ గా ఇప్పుడు రానా దగ్గుబాటి మరో విషయం కూడా చెప్పేశాడు. ఎప్పుడైతే రానా ఒక టివి ఛానల్ ప్రోగ్రాములో డ్రగ్స్ గురించి అడగ్గానే 'పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకు' అంటూ రిప్లయ్ ఇచ్చాడో.. అందరూ అవాక్కైపోయారు. అయితే అదే ఛానల్ ప్రసారం చేసిన పూర్తి ఇంటర్యూలో మాత్రం ఆ ఆన్సర్ లేనే లేదు. అప్పుడే అందరూ అర్ధం చేసుకున్నారు.. ఈ ప్రోమో మతలబు ఏంటో. ప్రమోషన్ కోసం మరీ ఇంత దారుణంగా చేయాలా అంటూ రానాను తిట్టేశారు.
ఇదే విషయంపై ఇప్పుడు రానాను ప్రశ్నించారు నెటిజన్లు. జోగేంద్రను 99 ప్రశ్నలు అడగండి అంటూ చేసిన ప్రమోషన్ ను చూసి.. చాలామంది మనోడ్ని ట్విట్టర్లో చాలా ప్రశ్నలే అడిగారు. వాటికి సమాధానం చెబుతూ.. అసలు ఆ రోజు యాంకర్ పైన ఆ విధంగా నిజంగానే అరిచారా అంటూ అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చాడు రానా. ''ఆ యాంకర్ ఒక ప్రోమో కటింగ్ చేసుకోవడానికి అలా చెప్పమంటే చెప్పాను'' అంటూ నవ్వేశాడు. అంటే అలాంటి ప్రమోషన్ తో సదరు టివి ఛానల్ కే కాని తనకు సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకున్నాడనమాట.
ఏదేమైనా కూడా.. ఏదో ఒక స్పయిసీ న్యూస్ తో ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమాను రానా గట్టిగానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ రేపు ఉదయం ధియేటర్లకు మాంచి సంఖ్యలో ఆడియన్స్ ను తీసుకురావచ్చు కాని.. అక్కడి నుండి మాత్రం సినిమాలోని కంటెంటే నడిపించాలి. ఓవర్ టు రానా అండ్ తేజ. ప్రేక్షకులే రాజు ప్రేక్షకులే మంత్రి.