Begin typing your search above and press return to search.

నారా గౌరవమంటున్న రానా

By:  Tupaki Desk   |   6 Aug 2018 8:24 AM GMT
నారా గౌరవమంటున్న రానా
X
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ స్పీడందుకుంది. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగా ముఖ్యమైన పాత్రలకు సంబందించిన ఆర్టిస్టులను దర్శకుడు క్రిష్ ఒక్కొక్కరిగా సెట్ చేసుకుంటున్నాడు. చంద్రబాబునాయుడుగా రానా నటిస్తాడని నేరుగా ఆంధ్రప్రదేశ్ సీఎంతో చర్చించిన ఫోటోల ద్వారా బయట పెట్టిన టీమ్ ఇప్పుడు మిగిలినవాళ్ల కోసం వెతుకుతోంది. రానా ఈ సందర్భంగా తన ట్విట్టర్ లో స్పందించాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాత్ర పోషించడం కంటే గౌరవం ఏముంటుందని పేర్కొన్న రానా అంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ షేర్ చేసుకోలేదు. ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో రానా దీని ద్వారా తనకే సమస్య లేదని తేల్చి చెప్పినట్టే. కాకపోతే రానా పాత్ర ఎంతసేపు ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

నారా చంద్రబాబు నాయుడుగా రానా పర్ఫెక్ట్ ఛాయస్ అని ఇప్పటికే అభిమానుల నుంచి ఫీడ్ బ్యాక్ వష్తోంది. రూపు రేఖల్లో గెడ్డం విషయంలో సారూప్యత ఉంటుంది కాబట్టి సహజంగా వస్తుందని ఆశిస్తున్నారు. కాకపోతే రానా పాత్ర రాజకీయ జీవితానికి సంబంధించినది కావడం వల్ల సినిమా మొత్తం ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో కీలకంగా మారింది టిడిపి పార్టీ పెట్టిన తర్వాతే. దానికి సంబంధించిన పార్ట్ ఇంటర్వెల్ తర్వాత ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. ఈ లెక్కన రానా కనిపించేది సెకండ్ హాఫ్ లో మాత్రమే అనుకోవచ్చు. లేదా తన కూతురు భువనేశ్వరిని బాబుకి ఇచ్చి పెళ్లి చేసే ఎపిసోడ్ ఏదైనా ఫస్ట్ హాఫ్ లో పెట్టొచ్చు. ఏదైనా రానా దీని గురించి చాలా స్పెషల్ గా ఫీలవుతున్నాడు. క్రేజీ ఆర్టిస్టులు జాయిన్ అవుతుండటంతో ఎన్టీఆర్ కు స్టార్ వేల్యూ పెరుగుతోంది. జనవరిని రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్న క్రిష్ అండ్ టీమ్ దాని కోసం పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు సమాచారం.