Begin typing your search above and press return to search.
గర్వంగా ఉందంటున్న రానా
By: Tupaki Desk | 1 Sep 2018 10:48 AM GMTతెలుగు జాతి ఉన్నంత కాలం నిలిచిపోయే పేరు ఎన్టీ రామారావు. తెలుగు వారి ఖ్యాతిని నలు దిశలా ఇనుమడింప జేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి గొప్ప వ్యక్తి బయోపిక్ ప్రస్తుతం తెరకెక్కుతుంది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్న విషయం తెల్సిందే. మొదటి నుండి కూడా రానా అయితే ఆ పాత్రకు బాగుంటాడు అంటూ అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే చంద్రబాబు నాయుడు పాత్రకు రానాను ఎంపిక చేయడం జరిగింది.
‘ఎన్టీఆర్’ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో - తాను కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని, చిత్రంలో నటించే ప్రతి రోజు కూడా థ్రిల్ ఫీల్ అవుతున్నాను అంటూ రానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ జీవించి ఉన్న సమయంలో నివాసం ఉన్న ఇంట్లోనే ఈ చిత్రం చిత్రీకరణ జరుపుతున్నారు. అబిడ్స్ లో ఎన్టీఆర్ నివాసంలో ఇప్పటి వరకు ఈ చిత్రంకు సంబంధించిన సింగిల్ షాట్ కూడా చిత్రీకరణ జరగలేదు. మొదటి సారి తాను నటిస్తున్న చిత్రంకు ఇక్కడ చిత్రీకరణ జరగడం చాలా సంతోషంగా ఉంది అంటూ రానా సంతోషంతో చెప్పుకొచ్చాడు.
ఎన్టీఆర్ జీవించిన ఇంట్లో నేను మేకప్ వేసుకుని నటించడం గర్వంగా ఉందని - ఇలాంటి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందంటూ రానా ఎగ్జైట్ అయ్యాడు. ఇదే షెడ్యూల్‌లో బాలీవుడ్ స్టార్ విద్యాబాలన్ కూడా బసవతారకం పాత్రలో నటిస్తున్నారు. బసవతారకం చుట్టు కథ తిరిగేలా ఈ చిత్రంను దర్శకుడు క్రిష్ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. యమ స్పీడ్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.