Begin typing your search above and press return to search.
రానా ప్రొడ్యూసర్ గా భలే కాంబినేషన్ సెట్ చేశాడే!
By: Tupaki Desk | 16 Oct 2022 5:37 AM GMTకొత్త కథ చెబితే మన దగ్గర వినేవాళ్లు కరువయ్యారు. అదే ఇదర భాషలో అదే కథ హిట్ అని, బ్లాక్ బస్టర్ అని తెలిస్తే మాత్రం దాని రీమేక్ హక్కుల్ని భారీ పోటీ వున్నా సరే వెంటపడి మరీ కొనేస్తున్నారు. ఇటీవల శింబు నటించిన తమిళ సినిమా `మానాడు` విషయంలో సిరగ్గా ఇదే జరిగింది. శింబు హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ మూవీ తమిళ నాట సంచలన విజయాన్ని అందించడమే కాకుండా హీరోగా శింబు కెరీర్ ని మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది.
ఈ మూవీ స్టోరీని ముందు దర్శకుడు వెంకట్ ప్రభు మన తెలుగు హీరోలకు వినిపించాడట. ఎంత మందికి చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదట. అయితే ఇదే కథని శింబు హీరోగా తమిళంలో `మానాడు` పేరుతో చేసి వెంకట్ ప్రభు బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చాలా మంది హీరోలు, నిర్మాతలు పోటీపడ్డారు. నాగచైతన్య కూడా భారీ మొత్తం చెల్లించి రైట్స్ తీసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఫైనల్ గా ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి హీరో రానా సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీలో రానా నటించడం లేదట. భలే కాంబినేషన్ ని ఈ మూవీ కోసం రానా సెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రానా, ఏషియన్ సునీల్ నారంగ్ కలిసి ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెలుగు స్టోరీలో మార్పులు చేర్పులు చేస్తుండగా, `శౌర్య` తరువాత 7 ఏళ్లుగా సినిమాలకు దూరంగా వుంటున్న దశరథ్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నారు.
ఇక హీరోలుగా మాస్ మహారాజా రవితేజని, డీజే టిల్లు సిద్దూ జొన్నలగడ్డని సెట్ చేశారు. ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. `గబ్బర్ సింగ్` రీమేక్ ని తనదైన పంథాలో మార్చి బ్లాక్ బస్టర్ హిట్ గా మలిచిన హరీష్ శంకర్ `మానాడు` రీమేక్ ని పర్ ఫెక్ట్ గా మార్చగలడని నమ్మిన రానా ఈ స్క్రిప్ట్ బాధ్యతల్ని హరీష్ శంకర్ కి అప్పగించాడట. అయితే `మానాడు` రివర్స్ స్క్రిన్ ప్లేతో సాగే టెర్రిఫిక్ యాక్షన్ ఎంటర్ టైనర్. దాన్ని అలాగే రీమేక్ చేసినా బ్లాక్ బస్టర్ గ్యారంటీ. మరి హరీష్ శంకర్ తెలుగుకు ఎలాంటి మార్పలు చేస్తున్నాడో ఉంటో వేచి చూడాల్సిందే.