Begin typing your search above and press return to search.

డిసెంబ‌ర్ నుంచి 'హిర‌ణ్య క‌సిప‌'

By:  Tupaki Desk   |   4 Aug 2019 7:17 AM GMT
డిసెంబ‌ర్ నుంచి హిర‌ణ్య క‌సిప‌
X
యంగ్ హీరో రానా అనారోగ్యం గురించి.. విదేశాల్లో కిడ్నీ ఆప‌రేష‌న్ జ‌రిగిన విష‌యంపైనా మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సంగ‌తిని ద‌గ్గుబాటి కుటుంబ స‌భ్యులు అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. మీడియాలో సాగిన ప్ర‌చారంపై డి.సురేష్ బాబు సీరియ‌స్ అయ్యార‌ని వార్త‌లొచ్చాయి. అదంతా అటుంచితే ప్ర‌స్తుతం రానా నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నార‌ట‌. త‌ర్వాత `విరాట ఫ‌ర్వం` సెట్స్ లో జాయిన్ అవుతార‌ని తెలుస్తోంది. సెప్టెంబ‌ర్ నుంచి రానాపై కీల‌క‌మైన షూటింగ్ ఉంటుంద‌ని చెబుతున్నారు. వేణు ఉడుగుల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం సాయి ప‌ల్ల‌విపై కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ సాగుతోంది.

ఈ సినిమాతో పాటు ఇత‌ర క‌మిట్ మెంట్ల మాటేమిటి? అంటే.. ఇప్ప‌టికే బాలీవుడ్ లో `హౌస్ ఫుల్ 4` షూటింగ్ పూర్త‌యింది. అందులో రానా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. దాంతో పాటే హాథీ మేరా సాథీ త్రిభాషా చిత్రానికి సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంది. కొంత పెండింగ్ షూట్ మిన‌హా కీల‌క షెడ్యూల్స్ ని పూర్తి చేశారు. వీటితో పాటు త‌దుప‌రి రానా కెరీర్ లో మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ గురించిన స‌న్నాహాలు చేస్తున్నారు.

రానా డ్రీమ్ ప్రాజెక్ట్ `హిర‌ణ్య‌క‌సిప`ను డిసెంబ‌ర్ లో లాంచ్ చేయ‌నున్నారు. ఆ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ రానా స్వ‌యంగా నిర్మాణ బాధ్య‌త‌ల్ని నెర‌వేరుస్తారు. తెలుగు- త‌మిళం- హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఇప్ప‌టికే దేశ‌- విదేశాల్లోని ప‌లు స్టూడియోల్లో ప్రీవిజువ‌ల్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని సురేష్ బాబు వెల్ల‌డించారు. గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఆయ‌న స్టూడియోలోనూ దీనికి సంబంధించిన ప‌నులు సాగుతున్నాయి.