Begin typing your search above and press return to search.
ఏం బాబూ ఇక్కడ హీరో అవ్వవా?
By: Tupaki Desk | 17 Nov 2015 10:30 PM GMTకొంపతీసి తెలుగు సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవడం కష్టం అనుకున్నాడా? లేకపోతే ఎప్పటికీ ఒక మూసలో కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ పోవడం ఎందుకులే అనుకున్నాడా? దగ్గుబాటి ఫ్యామిలీ నుండి ఫ్యూచర్ జనరేషన్ కమర్షియల్ కింగ్ అవుతాడనే అనుకుంటే.. రానా మాత్రం కొత్త ప్రయత్నాలేవో చేస్తూ షాకిస్తున్నాడు.
నిజానికి రానా కనుక వరుసగా కమర్షియల్ సినిమాలు చేసుకోవాలని అనుకుంటే.. ఎన్ని సినిమాలైనా తీసేంత ఎనర్జీ డాడ్ సురేష్ బాబు దగ్గరుంది. అలాగే ఎన్ని సినిమాలైనా రానాను పెట్టే హీరోగా తీయాలనే దర్శకులూ చాలామందే ఉన్నారు. అయినాసరే మనోడు మాత్రం ఎప్పుడూ ఏదో కొత్త క్యారెక్టర్ల వెంటే పడుతున్నాడు. బాహుబలిలో బల్లాలదేవ.. బెంగుళూరు డేస్ తమిళ రీమేక్ లో ఒక స్నేహితుడి రోల్.. ఇక ఇప్పుడు తమిళ డైరక్టర్ బాల డైరక్షన్ లో ఒక సినిమా.. మధ్యలో హిందీ సినిమాల్లో ఏదైనా రోల్సు.. ఇదేంటి రానా బాబూ? ఇక హీరో అవ్వవా మరి?
కాని ఒక టాప్ ఫ్యామిలీ నుండి వచ్చి.. పరపతి - పలుకుపడి - పైసల్.. మూడూ ఉండి.. మనోడు హీరో అవ్వకుండా ఇలాంటి కొత్త రూటులో వెళ్లడం కూడా బాగానే ఉంది. బాలీవుడ్ గురించి చెబితే.. ఒక మనోజ్ బాజ్‌పాయ్.. ఒక కేకె మీనన్.. ఒక నవాజుద్దీన్ సిద్దికి, ఒక ఇర్ఫాన్ ఖాన్.. ఇలా చాలామంది సైడ్ ఆర్టిస్టుల పేర్లు చెబుతాం. కాని తెలుగులో ప్రకాష్ రాజ్ తప్పిస్తే ఇంకో పేరు వినిపించదు. సో.. ఆ స్థానం రానా తీసుకుంటాడేమోలే.