Begin typing your search above and press return to search.

బాబాయి దగ్గర చాలా కొట్టేశా- రానా

By:  Tupaki Desk   |   2 July 2015 6:51 AM GMT
బాబాయి దగ్గర చాలా కొట్టేశా- రానా
X
ప్రస్తుత టాలీవుడ్‌ హీరోల్లో రానా దగ్గుబాటిని ఫ్యాషన్‌ ఐకాన్‌ అని చెప్పొచ్చు. బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేసిన అనుభవం ఉన్నవాడు కాబట్టి స్టైలింగ్‌ విషయంలో మనోడు మిగతా హీరోల కంటే చాలా అడుగులు ముందుంటాడు. ఐతే చిన్నప్పట్నుంచి తనకు ఫ్యాషన్‌ మీద ఓ అవగాహన కలగడానికి కారణం తన బాబాయి వెంకటేషే అని అంటున్నాడు రానా.

''బాబాయి ఎన్నో ఏళ్ల ముందే టాలీవుడ్‌కు ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని పరిచయం చేశాడు. ఈ విషయంలో మిగతా హీరోల కంటే ఆయన చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండేవారు. నేను చిన్నప్పటి నుంచి ఆయన వస్తువులు చాలా వాడేవాణ్ని. ఆయన దగ్గర్నుంచి బట్టలు, షూలు, కళ్లజోళ్లు.. ఇలా చాలా కొట్టేశాను. ఫ్యాషన్‌ విషయంలో నాకు గైడ్‌ ఆయన. ఐతే ఇండియా మొత్తంలో చెప్పాలంటే ఈ విషయంలో నాకు అమితాబ్‌ బచ్చన్‌ ఇన్‌స్పిరేషన్‌. ఆయన్ని మించిన స్టైల్‌ ఐకాన్‌ లేరు'' అని చెప్పాడు రానా.

తన బాబాయి దగ్గర్నుంచి చాలా వస్తువులు తీసుకునేవాణ్ని కానీ.. చెప్పులు, షూలు మాత్రం కాదని చెప్పాడు రానా. దీనికి కారణం తన పాదాల సైజు భారీగా ఉండటమే అన్నాడు. తన షూ సైజు 13 అని.. చాలా షాపుల్లో ఆ సైజు షూస్‌ కానీ, చెప్పులు కానీ దొరకవని.. కొన్ని అరుదైన బ్రాండ్లు మాత్రం తన సైజులో షూస్‌, శాండిల్స్‌ తయారు చేస్తాయని రానా వెల్లడించాడు.