Begin typing your search above and press return to search.
రాణాకి అలాంటి కంటెంట్ ఉండాలట
By: Tupaki Desk | 20 Nov 2015 4:11 AM GMTకొంతమంది జనాలకు ఏం నచ్చితే అదే సినిమాగా తీసేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొంతమంది మాత్రం తమకు నచ్చినది, తాము నమ్మిదని మూవీస్ గా తీసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. బాహుబలిలో భల్లాలదేవుడి పాత్ర తర్వాత రాణా నేషనల్ స్టార్ అయిపోయాడు. రాణాకి మూవీ ప్రొడక్షన్ పై కూడా మక్కువ ఎక్కువగానే ఉంది.
నిర్మాణ రంగంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు కావడంతో.. ఆ వైపు దృష్టి ఉండడం సహజమే. అయితే ఎలాంటి సినిమాలు తీయాలనే అంశంపై కూడా రాణాకి ఓ అంచనా ఉంది. కొన్నేళ్ల క్రితం ఏ తమిళ్ మూవీ చూశాడట రాణా. ఆ సినిమా విపరీతంగా నచ్చడంతో.. తనే నిర్మాతగా తీసి, హీరోగా కూడా యాక్ట్ చేయాలని భావించాడట. అయితే., మరో అభిప్రాయం కోసం వెంకీని అడిగితే., ఆ కాన్సెప్ట్ నీకు సరిపోదు అని చెప్పాడట. దీంతో మరో ఐదుగురు హీరోలను అడిగితే., ఎవరూ ఆ మూవీ చేసేందుకు ముందుకు రాలేదు. ఆ సినిమా పేరు గజిని. తర్వాత డబ్బింగ్ అయి తెలుగులో రిలీజ్ అయ్యాక.. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లోనూ ఫిక్స్ అయిపోయాడు సూర్య. తర్వాత హిందీలో ఇంకా సూపర్బ్ గా చేశాడు అమీర్ ఖాన్.
ఇలా తనకు మూవీస్ పై నిర్ణీత అభిప్రాయాలున్నాయని చెప్పిన రాణా.. తను మూవీస్ ని రోజా - శివ కాలం నుంచి ఫాలో అవుతున్నా అంటున్నాడు. అలాంటి ల్యాండ్ మార్క్ ఫిలింస్ తీయాలనే ఉద్దేశ్యంలో ఉన్నానని, ఆ కాన్సెప్ట్ లు దొరికితే ఖచ్చితంగా తనే నిర్మాత అవుతానంటున్నాడు రాణా. తను హీరోగా కాకపోయినా వేరే ఎవరితో అయినా సరే మూవీ చేస్తానని చెప్పాడు. ప్రొడక్షన్ ఫ్యామిలీ గై అనిపించాడు కదూ.