Begin typing your search above and press return to search.

వారసత్వం మీద రానా సాలిడ్ కౌంటర్

By:  Tupaki Desk   |   18 Jun 2019 5:03 AM GMT
వారసత్వం మీద రానా సాలిడ్ కౌంటర్
X
మనదగ్గర మరీ తీవ్ర స్థాయిలో చర్చ లేదు కానీ బాలీవుడ్ లో నెపోటిజం (వారసత్వం) మీద అప్పుడప్పుడు ఓ రేంజ్ యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. ఆ మధ్య కరణ్ జోహార్-వరుణ్ ధావన్-సైఫ్ అలీ ఖాన్ ఈ విషయంగా కంగనా రౌనత్ తో యుద్ధం చేసినంత పని చేశారు. ఇప్పటికీ ఆ చిచ్చు అప్పుడప్పుడు అలా రేగుతూ ఉంటుంది. ప్రతిభ లేకుండా కేవలం స్టార్ కిడ్స్ అనే ట్యాగ్ తో అన్ని అవకాశాలు లాగేసుకుంటున్నారునేదే ఈ వివాదంలోని అసలు మ్యాటర్.

సరిగ్గా ఇదే పాయింట్ మీద ఓ వెబ్ మీడియా లైవ్ ఇంటరాక్షన్ లో పాల్గొన్న రానాకు సూటి ప్రశ్న ఒకటి ఎదురయ్యింది. వారసత్వ పోకడల గురించి వాటి వల్ల ఇతరులకు ఛాన్స్ రాకపోవడం గురించి ఎదురైన క్వశ్చన్ కు తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు రానా. ప్రపంచంలో ఏ ఫిలిం ఇన్స్టిట్యూట్ గొప్ప దర్శకులను హీరోలను తయారు చేయదని కేవలం మనలో నైపుణ్యాలే ఆ స్థాయికి తీసుకెళ్ళాలి తప్ప ఫలానా కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నన్ను భరించే తీరాలి అనే పోకడ చెల్లదని క్లారిటీ ఇచ్చాడు. నాన్న నిర్మాత అమ్మ ఫిలిం ల్యాబ్ ఓనర్ బాబాయ్ స్టార్ హీరో తాతయ్య లెజెండరీ ప్రొడ్యూసర్ కాబట్టి సహజంగానే ఆ వాతావరణంలో పుట్టి పెరిగిన తనకు వాటి మీద పూర్తి అవగాహనా ఉందే తప్ప కేవలం అవి చూపించి రాణించాలంటే కుదరదని తేల్చి చెప్పేశాడు.

వీటి వల్ల ఎంట్రీ సులభమేమో కానీ ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర రుజువు చేసుకోవాల్సింది సదరు వారసులే అని క్లారిటీ ఇచ్చాడు. రానా చెప్పినదాంట్లో లాజిక్ ఉంది. ప్రతి స్టార్ వారసులు ఇండస్ట్రీలో నిలవలేదు. అమితాబ్ బచ్చన్ అంతటి ఆల్ ఇండియా స్టారే తన ఒక్కగానొక్క వారసుడు అభిషేక్ ని గొప్ప స్థాయిలో చూడలేకపోయారు. టాలీవుడ్ లోనూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. రానా అన్నట్టు ఇక్కడ గెలవాలంటే కావాల్సింది స్కిల్ ఒక్కటే