Begin typing your search above and press return to search.
యంగ్ జనరేషన్ అందరూ చూడాల్సిందే
By: Tupaki Desk | 28 Sep 2015 5:30 PM GMTగుణ టీమ్ వర్క్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం రుద్రమదేవి 3డి. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా సినిమాలో చాళుక్యవీరభద్రుడిగా నటించిన రానాతో స్పెషల్ ఇంటర్వ్యూ..
మొదటి 3డి సినిమా చేశారు.. మీ అనుభవాలు?
ఇది మొదటి హిస్టారికల్ 3డి సినిమా. ఇది యాక్టర్ సినిమా కాదు. డైరెక్టర్ సినిమా. కథ - పాత్రలు - యాక్షన్ - కాస్ట్యూమ్స్ - సెట్స్ సహా అన్ని విసయాల్లో ఎంతో జాగ్రత్త తీసుకుని చేసిన సినిమా. గుణశేఖర్ డేరింగ్ స్టెప్ ని మెచ్చుకోవాల్సిందే.
గుణశేఖర్ గురించి?
గుణశేఖర్ చాలా కాలంగా తెలుసు. నేను ఆయన దగ్గర స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అసిస్టెంట్ గా పనిచేశా. ఆయన ప్రతిదీ డీటెయిల్ గా తెలుసుకుని పనిచేస్తారు. ఏదైనా అనుకుంటే ఆ సీన్ తెరపై పక్కాగా రావాల్సిందే. అసలు ఖరీదు అనేది మ్యాటర్ కాదు. ఫైనల్ గా ఆ ఫ్రేమ్ లో తనకి కావాల్సింది వచ్చిందా లేదా అన్నది చూస్తారు. ఓ ఫిలింమేకర్ గా ఆయనకి నచ్చే విధంగా ఔట్ పుట్ తీసుకుంటారు.
మీ పాత్ర గురించి?
చరిత్రలో చాళుక్య వీరభద్రుని క్యారెక్టర్ గురించి ఎంతో పరిశోధించి రాసుకున్నారు గుణశేఖర్. రచయితలతో కలిసి ఆయన బోలెడంత రీసెర్చ్ చేశారు. పెయింటింగ్స్, పుస్తకాలు అన్నీ చదివేశారు. వీలున్న అన్ని కోణాల్లోనూ పరిశోధించి క్యారెక్టర్లను తయారు చేశారు.
కాస్ట్యూమ్స్, సెట్స్ .. ఇలా ప్రతిదానికి ఏదో ఒక ఆధారం ఉంది. వాటిని సినిమాటిక్ లిబర్టీస్ తో ఓ విజువల్ వండర్ గా చూపించారు.
బన్నితో కలిసి నటించారు ఈ సినిమాలో? తనతో పనిచయం ఎప్పట్నుంచి?
నేను, బన్ని 15ఏళ్లుగా స్నేహితులం. కలిసి నటించాం. గోన గన్నారెడ్డి పాత్ర సినిమాలో చాలా ప్రత్యేకమైనది. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ కలిసి నటించడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్.
నీతా లుల్లా గురించి? కాస్ట్యూమ్స్ గురించి?
ప్రస్తుత జనరేషన్ హిస్టరీతో డిష్కనెక్ట్ అయి ఉన్నారు. అలాంటివారికి అర్థమయ్యేలా ఈ సినిమా తెరకెక్కించారు. చరిత్రకారుల క్యారెక్టర్లను యూత్ కి అర్థమయ్యేలా డిిజైన్ చేశారు. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో నీతాలుల్లా పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకుని డిజైన్ చేశారు.
కళా దర్శకుడి గురించి?
ఓ రెగ్యులర్ సోషల్ ఫిలిం వేరు. ఇది వేరు. తోటతరణి ఒక్కడు కోసం ఛార్మినార్ సెట్ వేశారు. అర్జున్ సినిమా కోసం మధుర మీనాక్షి సెట్ వేశారు. ప్రతిదీ రిక్రియేట్ చేశారు. ఇప్పుడు ఏకంగా కోటలు, టెంపుల్స్ రకరకాల సెట్స్ డిజైన్ చేశారు. ఆయన వర్కింగ్ స్టయిల్ అమేజింగ్.
..గుణ టీమ్ వర్క్స్ .. బోల్డ్ అండ్ డేర్ స్టెప్ ఇది. ఈ సినిమాతో గుణశేఖర్ అద్భుతమైన విజయం అందుకోబోతున్నారు... అంటూ ముగించాడు రానా.