Begin typing your search above and press return to search.

చేపల మార్కెట్ ఓపెన్ చేసిన రానా

By:  Tupaki Desk   |   24 March 2016 7:42 AM GMT
చేపల మార్కెట్ ఓపెన్ చేసిన రానా
X
రీసెంట్ గా మంచు లక్ష్మి మేముసైతం అనే టీవీ షో ప్రారంభినప్పటి నుంచి స్టార్ హీరోలు - హీరోయిన్లు ఇలా ఏదో ఒక గెటప్ వేసుకుని నిధులు సేకరించడం చూస్తూనే ఉన్నాం. కానీ దగ్గుబాటి రాణా ఇప్పటికే కూలీ వేషంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మళ్లీ చేపల మార్కెట్ ప్రారంభించడం ఏంటా అనుకోవచ్చు. ఇది ఇండియాలో కాదు.. ఇప్పుడు రానా జపాన్ లో ఉన్నాడు.

ఇక్కడకు సమ్మర్ వెకేషన్ కోసం వెళ్లాడని చాలామంది అనుకుంటున్నారు కానీ.. వాస్తవం అది కాదు. ప్రస్తుతం రాణా సబ్ మెరైన్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఘాజీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం నీటి అడుగున తీసే సబ్ మెరైన్ సీన్స్ చిత్రీకరణకు జపాన్ వెళ్లాడు. అక్కడ సబ్ మెరైన్లలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు అనుమతి పొంది.. ఆ పనుల్లోనే ఉన్నాడు. మరి జపాన్ లోనూ, అక్కడ నీటి అడుగున అంటే.. తినేందుకు దొరికేవి సీ ఫుడ్స్ మాత్రమే. అందుకే రకరకాల సముద్ర జంతువుల వంటకాలను ఫోటోలు తీసి పోస్ట్ చేస్తున్నాడు రానా.

చేపల గుడ్లు - సుషీ - ఆయిస్టర్స్ - ఇతర సముద్ర జంతువులతో వండిన ఫుడ్ డిషెస్ పిక్స్ ను షేర్ చేస్తున్నాడు. వీటిని చూసిన అభిమానులకు నోరూరడం ఖాయం. చూడ్డానికే ఇంత ముచ్చటగా ఉంటే.. ఇక వాటిని తింటేనా అని ఫుడ్ లవర్స్ ఇప్పటికే ఊహించేసుకుంటున్నారు. స్వతహాగా ఆహార ప్రియుడు అయిన రానా.. ఇలాంటివాటిని ఏ మాత్రం వదిలిపెట్టకుండా లాగించేస్తాడు.