Begin typing your search above and press return to search.
పెళ్లయ్యాక నల్లపూసైపోయిన రానా
By: Tupaki Desk | 1 Nov 2020 11:30 PM GMTయువతీ యువకుల్లో వివాహం తర్వాత మార్పు కనిపిస్తుందని అంటారు. ఆ మార్పు ఇప్పుడు రానాలో స్పష్ఠంగా కనిపిస్తోంది. మునుపటితో పోలిస్తే అతడిలో ఆ అల్లరి కాస్త హైడ్ అయినట్టే కనిపిస్తోంది. చాలా రేర్ గానే బయట కనిపిస్తున్నాడు. అనవసర హంగామా అసలే కనిపించడం లేదు. పూర్తిగా సతీమణి కొంగు పట్టుకునే తిరుగుతున్నట్టే కనిపిస్తోంది.
వివాహం తరువాత జీవిత భాగస్వామితో చాలా సర్దుబాట్లు చేసుకోవాలి. మిహీకా బజాజ్‌తో వివాహం తర్వాత రానా దగ్గుబాటి జీవితం ఎలా మారిపోయింది? అతను ఇప్పుడు అదే వ్యక్తినా లేదా అతని విషయంలో ఏదైనా మార్పు కనిపిస్తోందా? అంటూ ఆరాలు తీస్తుంటే చాలా సంగతులే తెలిసాయి ఇలా.
అయితే మిహీక భార్యగా తన జీవితంలోకి ప్రవేశించిన తరువాత తన జీవితంలో పెద్ద మార్పు లేదని రానా చెబుతున్నారు. ఇప్పుడు మరింత బాధ్యత గా స్థిరంగా ఉన్నాడట. ఒకరినొకరు అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉన్నప్పుడు ఒకరు పెద్దగా మారవలసిన అవసరం లేదు. మిహీకాతో కలిసి జీవితాన్ని గడపడం చాలా సంతోషదాయకం.
తన వృత్తిగత జీవితం చూస్తే.. రానా తన సినిమాల షూటింగ్ ను ఇంకా ప్రారంభించలేదు. ‘ఆరణ్య’,... ‘విరాటా పర్వం’,.. ‘హిరణ్యకశిప’ లాంటి భారీ ప్రాజెక్టుల్ని పూర్తి చేయాల్సి ఉంది. ఇవేగాక రానా కోసం మరికొన్ని ప్రాజెక్టులు చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది.