Begin typing your search above and press return to search.

మరోసారి చీఫ్‌ మినిష్టర్‌ అవుతున్నాడా?

By:  Tupaki Desk   |   17 May 2016 5:30 PM GMT
మరోసారి చీఫ్‌ మినిష్టర్‌ అవుతున్నాడా?
X
కండలవీరుడు రానా దగ్గుబాటి.. బల్లాలదేవగా ఎంత పేరు తెచ్చుకున్నా కూడా.. ఇంతవరకు సోలో హిట్టు అనేది కొట్టలేదు. ''లీడర్‌'' సినిమాతో తెరంగేట్రం కుర్రాడికి పేరు తెచ్చినా.. ఆ తరువాత చేసిన సినిమాలన్నీ ఢమాల్‌ అనడంతో అసలు హీరోగా చేయకుండా చాన్నాళ్ల గ్యాప్‌ ఇచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ తేజ తీస్తున్న సినిమాతో హీరోగా తన లక్‌ ను చెక్‌ చేసుకోనున్నాడు కుర్రాడు.

ఆ మధ్యన పూరి జగన్‌ తీసిన నేనూ నా రాక్షసి.. తరువాత కొత్త డైరక్టర్ తీసిన నా ఇష్టం వంటి సినిమాల్లో మనోడు లవర్‌ బాయ్‌ వేషాలే వేశాడు. కాని అవేం అచ్చి రాలేదు. అందుకే అనుకుంట ఇప్పుడు తేజ డైరక్షన్‌ లో వస్తున్న సినిమాలో ఒక పొలిటికల్‌ గెటప్‌ వేస్తున్నాడట. గతంలో వచ్చిన లీడర్‌ సినిమాకు సీక్వెల్‌ తరహాలో సాగే ఈ సినిమాలో రానా ఒక లీడర్‌ గా కనిపిస్తాడా లేకపోతే ఒక చీఫ్‌ మినిష్టర్‌ గా కనిపించనున్నాడా అనేది ఇంకా తెలియదు. కాకపోతే కాజల్‌ అగర్వాల్‌ మాత్రం మనోడి వైఫ్‌ పాత్రలో మెరవనుందని తెలుస్తోంది.

ఏదేమైనా బాహుబలి సినిమా కాకుండా.. రానా సెపరేట్‌ గా తన బాక్సాఫీస్‌ కెపాసిటి ఏంటో ప్రూవ్‌ చేసుకోవాల్సి ఉంది. మరి తేజ అండ్‌ కాజల్‌ అందుకు ఎంతవరకు సాయపడతారో.. ఈ పొలిటికల్‌ బ్యాక్ డ్రాప్‌ కథ ఎంతవరకు ఉపయోగపడుతుందో.. వేచి చూడాల్సిందే!!