Begin typing your search above and press return to search.
‘ఘాజీ’లో రానా ఇలా ఉంటాడు..
By: Tupaki Desk | 13 Dec 2016 10:20 AM GMT‘బాహుబలి’ తర్వాత రానా దగ్గుబాటి రేంజే మారిపోయింది. అతను హీరోగా దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెలుగు-తమిళం-హిందీ భాషల్లో ‘ఘాజీ’ సినిమా తెరకెక్కుతోంది ప్రస్తుతం. దీన్ని బట్టే రానా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ సబ్ మెరైన్ వార్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ‘ఘాజీ’ మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ టైటిల్ లోగోను ఈ మధ్యే రిలీజ్ చేశారు. అది ఆకట్టుకుంది. ఇప్పుడు రానా లుక్ ను కూడా బయటపెట్టారు. ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో దర్శనమిస్తున్నాడు రానా ఇందులో.
బాహుబలి గడ్డాన్ని కొంచెం తగ్గించుకుని.. నేవీ ఆఫీసర్ డ్రెస్సులో కనిపిస్తున్నాడు రానా. ఈ లుక్ లోనే సినిమాలోని ఇంటెన్సిటీ చూపిస్తున్నాడు. 1971 నాటి ఇండియా-పాకిస్థాన్ యుద్ధానికి సంబంధించిన జనాలకు తెలియని కోణాన్ని ఈ సినిమా చూపించబోతోంది. ఈ యుద్ధం సందర్భంగా సముద్ర గర్భంలో మునిగిపోయిన ‘ఘాజీ’ అనే సబ్ మెరైన్ నేపథ్యంలో ఆసక్తికరమైన పుస్తకాన్ని రాసిన సంకల్ప్ రెడ్డే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పీవీపీ సంస్థ.. మరో ప్రొడక్షన్ హౌజ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. తాప్సి.. ఓంపురిలతో పాటు మరికొందరు బాలీవుడ్ ప్రముఖ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఘాజీ’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/