Begin typing your search above and press return to search.
రానా ఓ ఇంటివాడయ్యేది అప్పుడేనా...?
By: Tupaki Desk | 30 May 2020 5:30 PM GMTటాలీవుడ్ భల్లాలదేవుడు దగ్గుబాటి రానా ఎట్టకేలకు తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన బంటీ - సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బజాజ్ ను ప్రేమించిన రానా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. వీరి పెళ్ళికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పేశారు. రానా - మిహిక బజాజ్ వివాహం ఈ ఏడాదిలోనే ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకొని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారని.. వారిద్దరూ జీవితంలో ఒకటి కావాలనుకోవడం సంతోషమని.. ఇప్పటి నుండే పెళ్లి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నామని.. అన్ని కుదిరితే డిసెంబర్ కు ముందే పెళ్లి ఉండే అవకాశముందని రానా తండ్రి సురేష్ బాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల దగ్గుబాటి రానా - మిహీకా బజాజ్ ల రెండు కుటుంబాల వారు కలిసి రోకా వేడుకను నిర్వహించారు.
ఇదిలా ఉండగా ఈ రోకా వేడుకలో రానా - మిహిక బజాజ్ నిశ్చితార్థం.. వివాహం ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆగస్ట్ 8న హైదరాబాద్ లో రానా - మిహీకల పెళ్లి జరగబోతోందని సినీ వర్గాల్లో వినబడుతోంది. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అయితే మరి ఈ వార్తలపై దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించి రానా - మిహీకల ఎంగేజ్మెంట్ వివాహ వేడుకల తేదీలను ప్రకటిస్తారేమో చూడాలి.